Eye Health: కంటిచూపు మెరుగుపడాలంటే.. కచ్చితంగా ఇవి తినాల్సిందే?

మన శరీరంలో ఉండే జ్ఞానేంద్రియాలలో అతి ముఖ్యమైనవి కళ్ళు. అటువంటి కళ్ళు సరిగా కనిపించకపోతే ఏ పని సరిగా చేయలేము. ప్రతి చిన్న పని చేయడానికి ఇబ్బ

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 10:00 PM IST

మన శరీరంలో ఉండే జ్ఞానేంద్రియాలలో అతి ముఖ్యమైనవి కళ్ళు. అటువంటి కళ్ళు సరిగా కనిపించకపోతే ఏ పని సరిగా చేయలేము. ప్రతి చిన్న పని చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదే ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా కంటి చూపుము చిన్న వయసులో కోల్పోయి కళ్లద్దాల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం అనేక కారణాల వల్ల దృష్టి సమస్యలతో భాదపడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. చిన్న వయస్సులోనే కళ్లకు అద్దాలు వచ్చేస్తున్నాయి. అయితే కంటిచూపుnను మెరుగుపరచుకోవడానికి చాలామంది రకరకాల హోమ్ రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని విటమిన్లు, మినరల్స్‌ కంటి చూపును కాపాడటానికి ఇవి యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి.

ఇవి కణాలు, కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కంటి సమస్యలను నెమ్మదిగా తగ్గించడానికి తోడ్పడతాయి. మరికంటి చూపును మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లుటిన్‌, జియాక్సంతిన్‌ అనేవి మన కంటిలో ఉండే కెరోటినాయిడ్లు. ఇవి సూర్యరశ్మి నుంచి కంటిని రక్షిస్తాయి. ఇవి లైట్‌ ఫిల్టర్‌గా పనిచేస్తాయి. యూవీ కిరణాల వల్ల కంటి కణజాలాలు దెబ్బతినకుండా కాపాడతాయి. అరోగ్యకరమైన కంటి కణాలకు హాని చేసే ఫ్రీ రాడికల్స్‌, అన్‌స్టేబుల్‌ మాలిక్యూల్స్‌ నుంచి జియాక్సంతిన్‌ రక్షిస్తుంది. లుటిన్‌ జియాక్సంతిన్‌ పొందడానికి మీ డైట్‌లో ముదరు ఆకుపచ్చ కూరలు, గుడ్లు, పసుపు, ఆరెంజ్‌ రంగు పండ్లు, బ్రోకలీ, మొక్కజొన్న, బఠానీ, కాలే వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్‌ అని కూడా అంటారు.

విటమిన్ సి ఆక్సిజన్ తీసుకోవడం, కంటి లోపల ఆక్సిజన్ తక్కువ స్థాయిని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లెన్స్, విట్రస్‌లో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, కంటి శుక్లాలం ప్రమాదాన్ని తగ్గించడానికి విటమిన్‌ సి సహాయపడుతుంది. విటిమిన్‌ సి అధికంగా ఉండే కివి, క్యాప్సికమ్‌, టమాటా, బ్రోకలీ, పాలకూర, జామ కాయ, సిట్రస్‌ పండ్లు, ద్రాక్ష పండ్లు మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. అలాగే విటమిన్‌ ఇ ఫ్రీ-రాడికల్స్ నుంచి కళ్లను రక్షిస్తుంది. యూవీ కిరణాల నుంచి కంటిని కాపాడుతుంది. విటమిన్ ఇ పొందడానికి మీ ఆహారంలో వెజిటబుల్ ఆయిల్, నట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, చిలగడదుంప, అవకాడో, తృణధాన్యాలు తీసుకోవడం మంచిది.

మన శరీరంలో బీటా కెరోటిన్‌ విటమిన్‌ ఏ గా మారుతుంది. ఇది కంటిచూపునకు తోడ్పడే విటమిన్. రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ పొందడానికి బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని పండ్లు,కూరగాయలు వెన్న, టొమాటో మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఫ్యాటీ యాసిడ్స్ కళ్లకు, మెదడుకు మేలు చేస్తాయి. మీరు ఫ్యాటీ యాసిడ్స్‌ పొందాలనుకుంటే సాల్మన్, సార్డినెస్, అవిసె గింజలు, సోయాబీన్స్, చియా సీడ్స్‌, అక్రోట్లు, సోయాబీన్స్‌, గుడ్లు, పాల ఉత్పత్తులు, వాల్‌నట్‌లను మీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే.