Antacid Digene : డైజీన్ సిరప్ తాగుతున్నారా..? అయితే మీరు అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే..

డైజీన్ జెల్ (Digene Gel), సిరప్ వాడకాన్ని వెంటనే నిషేదించాలని, మార్కెట్ నుండి వెంటనే ఉపసంహరించుకోవాలని DCGI ఆదేశించింది

Published By: HashtagU Telugu Desk
Antacid Digene recalled in India

Antacid Digene recalled in India

గ్యాస్టిక్‌, కడుపులో ఉబ్బరం (Gas Trouble) వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కోసం చాలామంది డైజీన్ సిరప్ (Antacid Digene) తాగుతుంటారు. కొంతమందైతే ఇంట్లోనే ఈ సిరప్ ను స్టాక్ పెట్టుకుంటారు. అంతే కాదు ఎవరైనా గ్యాస్ ప్రాబ్లెమ్ తో ఇబ్బంది పడుతుంటే డైజీన్ సిరప్ ను వాడమని చెపుతుంటారు. అయితే ఇప్పుడు ఈ సిరప్ వాడితే అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు డాక్టర్స్.

డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) డైజీన్‌ సిరప్‌ను వాడద్దంటూ హెచ్చరిక జారీ చేసింది. డైజీన్ జెల్ (Digene Gel), సిరప్ వాడకాన్ని వెంటనే నిషేదించాలని, మార్కెట్ నుండి వెంటనే ఉపసంహరించుకోవాలని DCGI ఆదేశించింది. దీంతో మార్కెట్ నుండి కోట్ల బాటిళ్లను కంపెనీ రీకాల్ చేసింది. హోల్‌సేల్ వ్యాపారులు, పంపిణీదారులు ఈ ఉత్పత్తులన్నింటినీ తమ దుకాణాల నుండి తొలగించాలని సూచించింది.

డైజిన్‌ జెల్‌ టానిక్‌ పలు బ్యాచ్‌ల సరుకును ఆ మందు తయారీ సంస్థ అమెరికాకు చెందిన అబాట్‌ భారతదేశంలో స్వచ్ఛందంగా ఉపసహరించుకుంది. గులాబీ రంగులో ఉండాల్సిన సిరప్‌ తెల్లగా ఉందని, ఘాటైన వాసన వస్తుందని, తియ్యగా ఉండాల్సిన సిరప్ చేదుగా ఉందని వినియోగదారుల నుంచి ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also : Vibrio Vulnificus : అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న మరో బ్యాక్టీరియా.. 13 మంది మృతి

రోగులు డైజిన్‌ జెల్‌ ఉత్పత్తులను వినియోగించ వద్దని భారత ఔషధ నియంత్రణ సంస్థ(DCGI ) కూడా ఆగస్టు 31న బహిరంగ ప్రకటన చేసింది. కాగా, డైజిన్‌ జెల్‌ ఉపసంహరణ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డైజిన్‌ ట్యాబ్లెట్లు (Digene Tablets) సురక్షితమేనని డాక్టర్స్ స్పష్టం చేస్తున్నారు.

  Last Updated: 07 Sep 2023, 11:23 PM IST