Site icon HashtagU Telugu

‎Morning Drink: గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Morning Drink

Morning Drink

Morning Drink: ప్రస్తుత రోజుల్లో ఉన్న బిజీ లైఫ్ కారణంగా చాలామంది ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించలేకపోతున్నారు. హెల్త్ బాగాలేక పోయిన కూడా టాబ్లెట్స్ వేసుకొని అలాగే పని చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి సమయంలోనే ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. అయితే మహిళలు తమ ఆహారంలో నెయ్యిని చేర్చుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుందట.

‎ నెయ్యిలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు హార్మోన్లను సమతుల్యం చేయడంతో పాటుగా పీరియడ్స్‌ సమస్యలు,మానసిక స్థితిలో మార్పులు మొదలైన వాటిని తగ్గిస్తుందని చెబుతున్నారు. నెయ్యి చర్మానికి, జుట్టుకు కూడా పోషణ అందిస్తుందట. నెయ్యిలోని విటమిన్లు ఎ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతాయని,అంతే కాదు ఇది జుట్టును బలపరుస్తుందని దాని వల్ల జుట్టు మెరుస్తుందని చెబుతున్నారు. నెయ్యి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందట. నెయ్యి పేగు ఆరోగ్యానికి చాలా మంచిదట. ఆకలిని పెంచుతుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. నెయ్యిలోని బ్యూట్రిక్ ఆమ్లం పేగు కణాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

‎ నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయని, సాధారణ ఫ్లూ, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయని చెబుతున్నారు. ప్రసవం తర్వాత మహిళలకు నెయ్యి ఇవ్వడం వల్ల శరీర బలహీనత తగ్గుతుందట. ఎముకలు బలంగా ఉంటాయట. శక్తి పెరుగుతుందట. నెయ్యిలోని విటమిన్ K2 కాల్షియం శోషణకు సహాయపడుతుందని, ఇది ఎముకలను బలపరుస్తుందని, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. నెయ్యిని నియంత్రిత పరిమాణంలో తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుందట. శరీరానికి మంచి కొవ్వులు అందించడం ద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడుతుందట. ఉదయం గోరువెచ్చని నీటితో నెయ్యి కలుపుకుని తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపు నిండినట్లు ఉంటుందట. చిన్న పిల్లల ఆరోగ్యానికి కూడా నెయ్యి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

Exit mobile version