Kidney Stones: కిడ్నీ స్టోన్స్ కరిగించి.. బరువును తగ్గించే సూపర్ ఫుడ్

రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ ను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కిడ్నీ ఆకారంలో ఉండే రాజ్మా మన కిడ్నీ హెల్త్ కు కూడా చాలా బెస్ట్.

  • Written By:
  • Publish Date - February 12, 2023 / 08:00 PM IST

Kidney Stones: రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ ను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కిడ్నీ ఆకారంలో ఉండే రాజ్మా మన కిడ్నీ హెల్త్ కు కూడా చాలా బెస్ట్. అందులో ఉండే ప్రోటీన్‌, ఫైబ‌ర్, ఇత‌ర పోష‌కాలు కిడ్నీలోని రాళ్ల‌ను క‌రిగిస్తాయి. రాజ్మా వల్ల మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా బరువును తగ్గించడంలోనూ అది బాగా ఉపయోగపడుతుంది. రాజ్మాను వారానికి మూడు సార్లు వివిధ రూపాల్లో తీసుకోవచ్చు.  కొన్నిసార్లు, మీరు క్లాసిక్ రాజ్మా చావల్‌ తినొచ్చు. ఇతర సమయాల్లో రాజ్మాతో చేసిన బ్రూషెట్టా, టిక్కీ లేదా సలాడ్‌ వండుకొని తినొచ్చు.

■ పొట్ట క్లీన్ అవుతుంది

ప్రోటీన్స్, ఖనిజాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో రాజ్మా ఒకటి. ఇది నలుపు, ముదురు ఎరుపు, లేత ఎరుపు రంగులలో లభిస్తుంది.రాజ్మాలో అధిక మొత్తంలో ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రెట్, పొటాషియం, ఫాస్పరస్, ఫైబర్, సోడియం, కాపర్, ఫోలేట్, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంతే కాకుండా.. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. రాజ్మాలోని 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పూర్తి ప్రోటీన్‌ను తయారు చేస్తాయి. శరీర బరువు తగ్గడానికి తగినంత మొత్తంలో శరీరానికి ప్రోటీన్ అవసరం. రాజ్మాలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సమయం పాటు మనకు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది.దీంతో రాజ్మా తినడం వల్ల మన శరీర బరువు తగ్గుతుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.మలబద్ధకం సమస్య సమసి పోతుంది. పొట్ట
శుభ్రమవుతుంది. పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

■ రాజ్మా హెల్త్ బెనెఫిట్స్ ఇవిగో

★ ఎముకలకు బలం

వారానికి రెండు మూడు సార్లు రాజ్మా తినడం వల్ల ఎముకల్లో నొప్పి తగ్గుతుంది. రాజ్మాలోని క్యాల్షియం,మాలిబ్డినమ్‌ మన ఎముకలకు బలం ఇస్తుంది.

★ఫ్రీ రాడికల్స్ కట్టడి

రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

★ హిమోగ్లోబిన్ అప్

రాజ్మా మన శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రాజ్మాలో ఉండే మెగ్నీషియం , పొటాషియం రక్తప్రసరణను మెరుగుప‌రిచి అధిక ర‌క్త‌పోటు (హై బీపీ),  గుండె జ‌బ్బుల నుంచి మనల్ని ర‌క్షిస్తుంది.

★ బ్ల‌డ్ షుగర్ లెవ‌ల్స్ అదుపులోకి

రాజ్మాను తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. 100 గ్రాముల ఉడికించిన రాజ్మాలో 405 mg పొటాషియం ఉంటుంది. పొటాషియం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది. పొటాషియం వల్ల రక్తనాళాల గోడలపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.

 

★ రోగ నిరోధక శక్తి, బలం

రాజ్మా ఫుడ్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ప్రోటీన్ కణాలను నిర్మిస్తుంది. శరీరానికి బలాన్ని అందించడానికి మనం రెగ్యులర్ గా రాజ్మా తీసుకోవచ్చు.
రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉండడం వలన మీరు బలంగా ఉంటారు.

★జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది

చాలామంది మ‌తిమ‌రుపు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు.
అలాంటి వారు రాజ్మా తీసుకుంటే.. అందులో ఉండే బీ1 విట‌మిన్ వల్ల జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది.

■ రాజ్మాను అతిగా తింటే గ్యాస్‌, ఎసిడిటీ

రాజ్మాను అతిగా తీసుకోవ‌డం మంచిది కాదు . ఎందుకంటే అందులో ఉండే `ఫైటో హెమగ్లుటినిన్` అనే కొవ్వు పదార్థం జీర్ణం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.ఈ క్ర‌మంలోనే గ్యాస్‌, ఎసిడిటీ  స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాగే ఉడికీ ఉడ‌క‌ని రాజ్మాను కూడా తినొద్దు. దీనివ‌ల్ల క‌డుపు నొప్పి స‌మ‌స్య వ‌స్తుంది.

■ రాజ్మాలో పోషకాలు

★ 164 గ్రాముల రాజ్మా తింటే శరీరానికి 564 కేలరీల ఎనర్జీ అందుతుంది.
★ రాజ్మాలో 24 గ్రాముల ప్రోటీన్లు, 1.3 గ్రాముల కొవ్వు, 90 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 234 మిల్లీగ్రాముల కాల్షియం, 13 మిల్లీగ్రాముల ఇనుము, 229 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 4 మిల్లీగ్రాముల అవసరమైన పోషకాలు ఉన్నాయి.