Type-2 Diabetes : ఈ టీని రోజుకు నాలుగుకప్పులు తాగుతే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందట..!!

ఉదయం ఒక కప్పు టీ..మధ్యాహ్నం ఒక కప్పు...సాయంత్రం ఒక కప్పు..రాత్రి ఒక కప్పు...ఇలా నాలుగు కప్పుల టీ తాగితే...ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుస్తే షాక్ అవుతారు.

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 04:57 PM IST

ఉదయం ఒక కప్పు టీ..మధ్యాహ్నం ఒక కప్పు…సాయంత్రం ఒక కప్పు..రాత్రి ఒక కప్పు…ఇలా నాలుగు కప్పుల టీ తాగితే…ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుస్తే షాక్ అవుతారు. అవును నిజమే…ప్రతిరోజూ నాలుగు కప్పుల టీ తాగినే…ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చట. ముఖ్యంగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. అయితే ఇక్కడ ఏది పడితే ఆ టీ కాదు తాగాల్సింది. కేవలం బ్లాక్ లేదా గ్రీన్ లేదా ఊలాంగ్ టీ. ఈ మూడింటిలో ఏదైనా సరే ప్రతిరోజూ నాలుగు కప్పులు తాగితే చాలు. ఇది మేము చెబుతున్నది కాదు. 8 దేశాలలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వ్యక్తులపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

స్వీడన్ లోని స్టాక్ హోంలో ఈ ఏడాది యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ వార్షిక సమావేశంలో సమర్పించిన ఫలితాల్లో పేర్కొన్నారు. సగటున 10ఏళ్ల వ్యవధిలో రోజుకు కనీసం నాలుగు కప్పుల టీ తాగాలని ఈ పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 17శాతం వరకు తగ్గిస్తుందని పేర్కొన్నారు. 1లేదా 3 కప్పుల టీ డయాబెటీస్ ప్రమాదాన్ని 4శాతం వరకు తగ్గించగలదని పరిశోధనల ఫలితాలు సూచిస్తున్నాయి.

ప్రతిరోజూ 4 కప్పుల టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. యాంటీ ఆక్సిడెంట్లను ఉత్పత్తి చేసే టీ ఆకులలో పాలీఫెనాల్స్ ఉనికికి సంబంధించినవని పరిశోధకులు తెలిపారు. ఈ సమ్మేళనాలు శరీరంలో మంట, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.