Site icon HashtagU Telugu

Guava Leaves: షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ ఆకు దివ్య ఔషధం.. ఒక్క ఆకుతో షుగర్ కంట్రోల్ అవ్వడం ఖాయం!

Guava Leaves

Guava Leaves

జామ పండుని పేదవాడి ఆపిల్ అని పిలుస్తారు. జామ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం జామపండు వల్ల మాత్రమే కాకుండా జామ ఆకువల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. జామ ఆకుల టీ లేదా కషాయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి జామ ఆకులు ఎంతో బాగా ఉపయోగపడతాయట. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయట. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. జామ ఆకుల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలు ఆహారం ద్వారా శరీరంలోకి చేరిన గ్లూకోజ్‌ ను నియంత్రించడంలో సహాయపడతాయట.

ఇవి కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తాయని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని చెబుతున్నారు. జామ ఆకుల టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుందట. ఇన్సులిన్ నిరోధకత అనేది టైప్ 2 డయాబెటిస్‌ కు ఒక ముఖ్య కారణం అని చెబుతున్నారు. జామ ఆకులు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయట. దీనివల్ల శరీర కణాలు ఇన్సులిన్‌ కు మరింత సున్నితంగా స్పందిస్తాయట. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుందట. డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉందట. జామ ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయట. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట.

ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడతాయట. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయట. దీనివల్ల డయాబెటిస్ సమస్య మరింత తీవ్రమవుతుందని చెబుతున్నారు. జామ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ నష్టాన్ని నివారిస్తాయట. జామ ఆకుల్లో విటమిన్ సి, ఇతర పోషకాలు ఉంటాయట. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయట. డయాబెటిస్ ఉన్నవారికి రోగనిరోధక శక్తి చాలా అవసరం, ఎందుకంటే వారి శరీరం ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందట. జామ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయట. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుందట. మంచి జీర్ణక్రియ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందట. కొన్ని జామ ఆకులను నీటిలో వేసి మరిగించి టీలా తయారు చేసుకోవచ్చట. ఈ టీని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగవచ్చట. జామ ఆకులను నీటిలో వేసి బాగామరిగించి, ఆ నీటిని కషాయంలా తాగవచ్చట. జామ ఆకులను ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడిని ఆహారంలో కలుపుకోవచ్చట. అయితే గర్భిణులు,పాలిచ్చే తల్లులు జామ ఆకులను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు.