Site icon HashtagU Telugu

Tasty Pickles : ఇంట్లోనే రుచికరమైన ఊరగాయలు తయారుచేసుకోవడంలో కొత్త ట్రెండ్..ఆరోగ్యానికి ఎన్ని లాభాలో!

A new trend in making delicious pickles at home...with so many health benefits!

A new trend in making delicious pickles at home...with so many health benefits!

Tasty Pickles : ఈ రోజుల్లో మార్కెట్‌లో లభించే ప్యాకేజ్డ్ ఫుడ్‌లలో రసాయనాలు అధికంగా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు ఇంటి వంటలపైనే ఎక్కువ భరోసా చూపిస్తున్నారు. ప్రత్యేకంగా ఊరగాయల విషయంలో ఇంట్లో తయారుచేసే పద్ధతులు మరలా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటంతో పాటు రుచిలోనూ మారు మోగించే ఈ ఊరగాయలు మనం సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఈ వంటకాలను ప్రయత్నించండి.

ముల్లంగి ఊరగాయ – క్రంచీ టేక్‌తో డైలీ స్పైసీ బైట్

ముందుగా ముల్లంగిని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. ప్రతి ముక్కను సమానంగా పాకేలా ఉప్పు, పసుపు, కారం, ఆవాల నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల పాటు ఎండలో ఉంచితే ముల్లంగి ముక్కలు బాగా ఊరుతాయి. దీనికి స్పెషల్ టచ్ ఏమిటంటే, బయట క్రంచీగా, లోపల రుచిగా ఉండడం. భోజన సమయంలో ఒక తిప్పు చాలు.. రుచి మరిగిపోతుంది.

ఉసిరికాయ ఊరగాయ – ఇమ్యూనిటీ బూస్టర్, టేస్ట్ మాస్టర్

ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంత మేలవో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కారం, ఆవాలు వేసి బాగా కలిపిన తర్వాత మిశ్రమాన్ని మూడునుంచి నాలుగు రోజులు ఎండలో ఉంచాలి. ఊరిన తర్వాత దీనిని భోజనంతో కలిపి తింటే మధురమైన రుచి తోడుగా మంచి ఆరోగ్య ప్రయోజనం లభిస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ C మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

క్యారెట్ మసాలా – కారంగా, పుల్లగా, సరికొత్త రుచితో

క్యారెట్‌ను పొడవాటి ముక్కలుగా కోసి, అందులో ఉప్పు, పండిన మిరపకాయలు, వాము, ఆవాల నూనె కలిపి బాగా మసాలా పట్టేలా కలపాలి. దీన్ని నాలుగు రోజులు ఎండలో ఉంచితే మసాలా క్యారెట్ ఊరగాయ సిద్ధం అవుతుంది. ఇది కారంగా, కొంచెం పుల్లగా ఉండి భోజనానికి సైడ్‌ డిష్‌గానూ, స్నాక్‌లా కూడా పనిచేస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఓ హెల్తీ ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఉల్లిపాయల ఇన్‌స్టంట్ ఊరగాయ – ఒక్క రోజులో సిద్ధం

చిన్న ఉల్లిపాయలను శుభ్రంగా తీయాలి. పైన తొక్కలు తీసేసిన తర్వాత అందులో ఉప్పు, ఎర్ర మిరపకాయలు, కొద్దిగా వెనిగర్, తరువాత ఆవాల నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కేవలం ఒక రోజు ఎండలో ఉంచితే చాలు – రుచికరమైన ఉల్లిపాయల ఊరగాయ సిద్ధం. ఇది ప్రత్యేకంగా రోటీ, పరాఠాతో తింటే అద్భుతంగా ఉంటుంది. పికిల్ లవర్స్‌కి ఇది ఓ బేస్ట్‌ క్విక్‌ ఆప్షన్‌. ఈ ఇంటి తయారీ ఊరగాయలు రుచికరంగా ఉండడమే కాకుండా, మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వ్యర్థ రసాయనాలు లేకుండా, నూనె, ఉప్పు వాడకం మీ నియంత్రణలో ఉండటం వల్ల ఇవి ఆరోగ్యవంతమైన ఎంపికలుగా నిలుస్తాయి. మీరు కూడా ఈ వంటకాలను ఈ వారం ట్రై చేసి, ఆరోగ్యం + రుచి రెండింటిని సొంతం చేసుకోండి.

Read Also: Herbal Tea Benefits : హెర్బల్‌ ‘టీ’తో ఎన్నో ప్రయోజనాలు.. చాలా సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు!