Heart attack Symptoms : ఒక నెల ముందే శరీరం తెలియజేస్తుంది గుండెపోటు గురించి…ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి..!!

గుండెపోటు లేదా గుండెజబ్బులు వయస్సును బట్టిరావడం లేదు. పలు కారణాల వల్ల ఏవయస్సులోనైనా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 08:00 AM IST

గుండెపోటు లేదా గుండెజబ్బులు వయస్సును బట్టిరావడం లేదు. పలు కారణాల వల్ల ఏవయస్సులోనైనా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇది చివరికి మరణానికి దారితీస్తుంది. అయితే గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. గుండెపోటు గురించి మన శరీరానికి ఒక నెల ముందుగానే తెలియజేస్తుంది. ఇందులోకొన్ని మినహాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, షుగర్,శరీరంలోకొవ్వు అధికంగా ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువ. అధిక ఒత్తిడి ఎప్పుడైనా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ గుండెకు సమస్యలున్నాయని ఇలా తెలుసుకోండి.

మీకు శ్వాసతీసుకోవడంలోఇబ్బుందులు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. ఏదైనా గుండె సమస్య వస్తే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ కూడా తగ్గిపోతోంది. అధిక శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఊపిరిపీల్చుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఎలాంటి కారణం లేకుండా విపరీతమైన చెమట పడుతుంది. అది ఆందోళన కలిగించే విషయం అని అప్పుడు తెలుస్తుంది. శరీరంలో రక్తప్రసరణ తగ్గిన వెంటనే శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది తలెత్తుతుంది.

అర్థరాత్రి సడెన్ గా మెలుకువ వస్తుంది. బాగా చెమటలు పడుతుంటాయి. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఇదంతా గుండెపోటుకు సూచన.మీకు ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తే మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలన్నింటికీ అదనంగా…కడుపులో అసౌకర్యంగా లేదా నొప్పి, వెన్నునొప్పి మహిళల్లో కనిపిస్తాయి. ఇవి కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని సూచిస్తాయి.