Diet and Nutrition : బరువు తగ్గడం అనేది చాలా మంది గోల్. ఇది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది కొంతమందికి. వారంలో కిలో తగ్గాలని, పదిరోజుల్లో కనీసం 2 కేజీలు తగ్గాలని, నెలరోజుల్లో అంటూ ఇలా ఏవేవో లెక్కలు వేసుకుంటారు. అనుకున్నట్లుగా మొదటి ఒకటి, రెండు రోజులు ప్రయత్నిస్తారు. కానీ, ఆ తర్వాత అనేక కారణాల వల్లో, బోర్‌గా ఫీల్ అవ్వడం వల్లో మళ్లీ నార్మల్‌గా అయిపోతారు. అలా కాకుండా, సీరియస్‌గా బరువు తగ్గాలనుకున్నవారు స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే కచ్చితంగా అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. దీనికోసం మంచి డైట్ ప్లాన్ కూడా షేర్ చేస్తున్నారు న్యూట్రిషనిస్ట్ నేహా పరిహార్.
బరువు తగ్గాలనుకోవడం వేరు, బరువు తగ్గడం వేరు. మనలో ఎక్కువ మంది బరువు తగ్గాలనుకుంటారు. కానీ, బరువు తగ్గరు. దీనికి కారణం వారు చేస్తున్న మిస్టేక్సే. అనుకోవడమైతే చేస్తున్నారు. కానీ, ప్రయత్న లోపం వల్ల బరువు తగ్గట్లేదు. దీంతో బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఓ రొటీన్‌ని అనుకోవాలి. ఏం తినాలో, ఏం తినకూడదో అది కూడా ఏ టైమ్‌కి ఏం తినాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకుని స్ట్రిక్ట్‌గా ఫాలో అయితేనే, బరువు తగ్గడానికి ఈజీ అవుతుంది. దీనికోసం ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూట్రిషనిస్ట్ నేహా పరిహార్ మంచి డైట్‌ని సజెస్ట్ చేస్తున్నారు. ఆమె చెప్పినట్లుగా తింటే వారం రోజుల్లోనే కిలోకి పైగా బరువు తగ్గుతారు. అంతేకాదు, బెల్లీ ఫ్యాట్ కూడా ఉండదు. మరి, ఇంకేం కావాలి. ఎలాగూ క్రిస్మస్, న్యూ ఇయర్స్ ఉండనే ఉన్నాయి. ఆ టైమ్‌లోపు మీరు అనుకున్నట్లుగా బరువు తగ్గాలంటే ఆ డైట్ తెలుసుకోండి.
ఉదయాన్నే డీటాక్స్ డ్రింక్
ఉదయం లేవగానే ఏమైనా తాగాలనుకునేవారు డీటాక్స్ డ్రింక్‌తో మీ రోజుని మొదలుపెట్టండి. దీనికోసం మంచి హెర్బల్ డ్రింక్స్ అయినా ఉసిరి, పసుపు, నిమ్మరసం కలిపిన డ్రింక్ లేదా జీలకర్ర నీరు ఏదైనా తీసుకోవచ్చు. రెండు కూడా చక్కగా బాడీని డీటాక్స్ చేస్తాయి. దీంతో పాటు జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. బ్లోటింగ్‌ని తగ్గిస్తాయి.
బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకోవాలంటే
- మూంగ్‌దాల్ చీలా 2 , పుదీనా చట్నీ అంటే పెసరపప్పుని మిక్సీ పట్టి దోశపిండిలా చేసి వాటిని దోశల్లా చేసుకుంటే చాలు. ఇలా కాకుండా ఆప్షన్ 2 కూడా ఉంది. అందులో..
- బేసన్ చీలా, 100 గ్రాముల లో ఫ్యాట్ పనీర్‌ని స్టప్‌ని తీసుకోవచ్చు. దీనిని మీరు బ్లాక్ కాఫీ, అన్‌స్వీటెన్డ్ ఆల్మండ్ మిల్క్ టీతో తీసుకోవచ్చు. కేలరీలు అనేవి దీని వల్ల 250 నుంచి 300 గ్రాములు ఉంటాయి. ప్రోటీన్ 18 నుంచి 22 గ్రాములు ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. లో కార్బ్స్ ఉంటాయి. కడుపు నిండుగా ఉంటుంది.
మిడ్ మార్నింగ్‌లో ఏం తినాలంటే
- ఓ ఆపిల్ లేదా కుకుంబర్, క్యారెట్ స్టిక్స్ 1 టీస్పూన్ చాట్ మసాలా వేసుకుని తినొచ్చు.
- ఇందులో 50 కేలరీలు ఉంటాయి. నీరు అందుతుంది. ఫైబర్ కూడా దొరకుతుంది.
- లంచ్‌లో తినాల్సిన ఫుడ్
- 1 చిన్న గిన్నెలో మైసూర్ పప్పు లేదా కందిపప్పు
- 1 మల్టీగ్రెయిన్ రోటీ లేదా అరకప్పు ఉడికించిన బ్రౌన్ రైస్
- 1 కప్పు సాట్ చేసిన కూరగాయలు లేదా ఉడికించిన కూరగాయలు
- 1 టేబుల్ స్పూన్ పెరుగు(ఆప్షనల్)
- కేలరీలు 350 నుంచి 400 ఉంటాయి. దీని వల్ల గట్ హెల్త్ బాగుంటుంది.
ఈవెనింగ్ స్నాక్ టైమ్‌లో
- వేయించిన శనగలు 30 గ్రాములు, గ్రీన్ టీ
- ఆప్షన్ 2 : 150 గ్రాముల గ్రీక్ యోగర్ట్ కొద్దిగా దాల్చిన చెక్క పొడి చల్లి తినండి.
- ఇందులో కేలరీలు 150 నుంచి 180 కేలరీలు ఉంటాయి.
- ప్రోటీన్ 8 నుంచి 10 గ్రాములు ఉంటుంది.
- దీని వల్ల క్రేవింగ్స్, షుగర్ కంట్రోల్ కంట్రోల్ అవుతుంది.
డిన్నర్‌లో తినాల్సిన ఫుడ్
- డిన్నర్ చాలా వరకూ 7 నుంచి 8లోపే చేయాలి.
- దీనికోసం ఓట్స్, వెజ్ కిచిడి. లేదా క్వినోవా పనీర్ టిక్కి
- ఇందులో మనకి 300 నుంచి 350 కేలరీలు, ప్రోటీన్ 20 గ్రాములు అందుతుంది.
- కార్బ్స్ తక్కువగా ఉంటాయి. త్వరగా అరుగుతాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
డైట్‌తో బెనిఫిట్స్
- ఈ డైట్ ఫాలో అయితే వారంలో కిలోకి పైగా తగ్గుతారు.
- వారంలోపే బెల్లీ తగ్గుతుంది.
- జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
- కాన్పిడెన్స్ పెరుగుతుంది.
- అన్నీ బట్టలు సూట్ అవుతాయి.
- మెడిసిన్ లేకుండానే చాలా సమస్యలు తగ్గుతాయి.
