Healthy Food Weight Loss: అధిక బరువును తగ్గించే 8 ఆహారాలు.. మహిళలకు ప్రత్యేకం!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. మరి ముఖ్యంగా మహిళలు ఈ అధిక బరువు సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 10:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. మరి ముఖ్యంగా మహిళలు ఈ అధిక బరువు సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. బరువు సమస్య తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందుతూ ఉంటారు. అయితే అటువంటి వారి కోసం బరువును తగ్గించే 8 ఆహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కేవలం మహిళలకే కాకుండా పురుషులకు కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.. క్యారెట్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి.

ఇందులో ఉండే బీటా కెరోటిన్, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్లను జ్యూస్ సలాడ్,స్మూతీలుగా తీసుకోవడం వల్ల ఇవి కొవ్వును బాగా కరిగిస్తాయి. అలాగే ఆకుకూరల్లో పోషకాలు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఏది తినబుద్ధి కాదు. అంతేకాకుండా ఆకుకూరలు స్నాక్స్ వంటివి తినకుండా అడ్డుకుంటాయి. అలాగే జీర్ణ క్రియ కూడా బాగా జరుగుతుంది. కొవ్వు పేరుకుపోవడం లాంటివి జరగవు తద్వారా బరువు కూడా తగ్గుతారు. కాలీఫ్లవర్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి.

కాలీఫ్లవర్ ను ఎంత ఎక్కువగా తిన్నా కూడా బరువు పెరగరు. మహిళలకు ఇది సరైన ఆహారం అని చెప్పవచ్చు. తగ్గాలి అనుకున్న వారు కాలిఫ్లవర్ ను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే చిక్కుడుకాయల్లో కొవ్వు ఉండదు. విటమిన్లు సి, కె, ఏ, కెరాటెనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటాయి. బరువు తగ్గాలి అనుకున్న మహిళలు వీటిని తినవచ్చు. 30 నుంచి 40 ఏళ్ల వయసు మహిళలు బరువు తగ్గాలి అనుకున్నవారికి బ్రకోలి బాగా ఉపయోగపడుతుంది. బ్రకోలిని ప్రతి రోజు తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. ఆపిల్స్ బరువు తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ పొట్ట నిండిన ఫీలింగ్ ను కలిగించడం వల్ల ఏమి తినబుద్ధి కాదు. వీటిలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల ఎన్ని తిన్నా కూడా బరువు పెరగరు.