Site icon HashtagU Telugu

Kidney Stones: కిడ్నీలో రాళ్లను కరిగించే 7 రకాల పానీయాలు.. అవేంటంటే?

Foods Good For Kidneys

Kidney Stones

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఒకటి. కాకుండా ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. కిడ్నీ స్టోన్ అంటే మూత్రంలోని రసాయనాల నుంచి తయారయ్యే ఒక గట్టి పదార్థం. రక్తంలో చాలా వ్యర్థాలు ఉన్నప్పుడు శరీరం తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేయలేకపోతే మూత్రపిండాలలో స్ఫటికాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ స్ఫటికాలు ఇతర వ్యర్థాలు రసాయనాలను ఆకర్షిస్తూ ఘన వస్తువుగా మారుతుంది. మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లకపోతే అది పెద్దదిగా మారుతుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ప్రతిరోజు 8 నుంచి 12 గ్లాసుల నీటిని తాగాలి.

ఎక్కువ నీటిని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కిడ్నీలు రాళ్లు కరిగించే ఏడు పానీయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిమ్మకాయలో సిట్రేట్ ఉంటుంది, ఇది కాల్షియం రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ రెండు లీటర్ల నీటిలో నాలుగు నిమ్మకాయలు పిండి తాగడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే దానిమ్మ రసం కూడా మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. దానిమ్మ రసాన్ని అల్సర్లు, విరేచనాలతో సహా అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కాల్షియం ఆక్సలేట్‌ను తగ్గిస్తుంది.దాంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించే ఎసిడిటీ స్థాయిలను తగ్గించడంలో దానిమ్మ రసం బాగా ఉపకరిస్తుంది.

అలాగే గోధుమ గడ్డి రసం జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతోబాగా సహాయపడతాయి. ఈ రసాన్ని మొదట కొద్ది మొత్తంలో తీసుకోవడం ప్రారంభించాలి. ఆ తరువాత కొద్ది రోజులకు కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది రాళ్లను బయటకు పంపడానికి మూత్ర ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇకపోతే గ్రీన్ టీ.. ఇది కాల్షియం ఆక్సలేట్‌తో కలిపి ఉంటుంది. ఇది కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది కిడ్నీ ఎక్కువ కాలం పని చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో ఎపిగాల్లోకాటెచిన్ గాలేట్ కూడా అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఆటంకం కలిగిస్తుంది. మూత్రవిసర్జన నుండి రాళ్ళు సులభంగా తొలగించేందుకు గ్రీన్ టీ సహాయపడుతుంది. సెలెరీ రసం.. ఈ సెలెరీ జ్యూస్ ఒక సహజ మూత్రవిసర్జన నొప్పి నివారిణి అని చెప్పవచ్చు. ఇది మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం ఒక గ్లాసు సెలెరీ జ్యూస్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు త్వరగా మాయమవుతాయి. అలాగే కిడ్నీ బీన్స్‌లో విటమిన్ బి ఉంటుంది. ఇది రాళ్లను కరిగించి బయటకు పంపుతుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహించే ముఖ్యమైన ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి.

Exit mobile version