Cough: పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా చాలామంది ఈ పొడి దగ్గుతో రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 06:00 PM IST

చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా చాలామంది ఈ పొడి దగ్గుతో రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. దగ్గు జలుబు వచ్చింది అంటే చాలు నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా పొడి దగ్గుతో వారికి నిద్రకు రాకపోవడంతో పాటు పక్కవారికి కూడా సరైన నిద్ర ఉండదు. పొడి దగ్గు తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల మందులను వాడినప్పటికీ మళ్లీ మళ్లీ అలాగే వస్తూ ఉంటుంది. ఇందుకోసం పసుపు వేసిన పాలు తాగడం ఎంతో మంచిది.

పొడి దగ్గుతో బాధపడుతున్న వారు ఆ సమస్య నుంచి బయటపడడానికి ప్రతిరోజు రెండుసార్లు గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గు విపరీతంగా వేధిస్తూ ఉంటే పాలు పసుపుతో పాటు వెల్లుల్లి లవంగాన్ని కలిపి తాగాలి.. వెల్లుల్లి వాసన అంటే చాలామందికి పడదు. అలాంటి వారు అల్లంని జోడించి తీసుకోవచ్చు. దాంతో పాటు గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి గొంతులో పోసుకుని పుక్కిలించాలి.

పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల ఏజెంట్ ఉంది, ఇది బలమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఇన్ఫెక్షన్ల చికిత్సకు సహాయపడుతుంది. అల్లం, వెల్లుల్లి గొంతులోని గరగరను తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో పాటు సహజ అనాల్జెసిక్‌లుగా పనిచేస్తాయి. నిద్రపోయే ముందు తాగడం వలన వేడి పాలు మీ ఛాతీ నుండి శ్లేష్మం పైకి రావడానికి సహాయపడుతుంది. అలాగే దానిమ్మ పండు రసం చిటికెడు అల్లం పొడితో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

దానిమ్మ రసం గొంతు పై తేలికపాటి ప్రభావాన్ని చూపుతుంది. దానిమ్మలో విటమిన్ ఏ సి అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం పొడి, ఒక చిటికెడు దాల్చినచెక్క, కొన్ని లవంగాలు కలిపి మసాలా టీ తాగితే దగ్గు నుంచి రిలీఫ్‌గా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గిస్తాయి. ముక్కు కారడం లాంటి సమస్యలు ఉన్న ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కాలు పాటించడం వల్ల పొడి దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.