Site icon HashtagU Telugu

Vegetarian Snacks: అద్భుతమైన ప్రోటీన్‌ను అందించే 5 శాఖాహార ఆహారాలివే!

Vegetarian Snacks

Vegetarian Snacks

Vegetarian Snacks: ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య కారణాల వల్ల లేదా వ్యక్తిగత ఇష్టాయిష్టాల కారణంగా మాంసాహారం తీసుకోవడానికి దూరంగా ఉంటున్నారు. దీనివల్ల వారు తమ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ను ఎలా తీసుకోవాలో? ఏ ఆహారాలను తినాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు కూడా మీ కండరాలను బలోపేతం చేసుకోవడానికి, శక్తి స్థాయిలను పెంచుకోవడానికి, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే కొన్ని ప్రత్యేకమైన శాఖాహార ఆహారాలు (Vegetarian Snacks) మీకు వరంలాంటివి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ప్రోటీన్, శక్తిని అందించే 5 అద్భుతమైన శాఖాహార ఆహారాల గురించి తెలుసుకుందాం.

5 శాఖాహార ప్రోటీన్ స్నాక్స్

శనగలు: శనగలు (చనా) ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మీ రోజువారీ ప్రోటీన్ అవసరాన్ని సులభంగా తీర్చుకోవడానికి శనగలను సలాడ్, స్నాక్స్ లేదా కూరల్లో చేర్చుకోవచ్చు.

పనీర్: శాఖాహారులకు కండరాలు పెంచుకోవడానికి పనీర్ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఎముకలను బలోపేతం చేసే కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. మీరు దీనిని కూరగాయలతో, శాండ్‌విచ్‌లలో లేదా గ్రిల్ చేసి తీసుకోవచ్చు.

Also Read: Coach Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలు భారత్‌కు భారంగా మారుతున్నాయా?

పప్పు ధాన్యాలు- వేరుశెనగ: మసూర్, పెసర, మినప వంటి పప్పు ధాన్యాలు ప్రోటీన్‌లో చాలా మంచివి. అదేవిధంగా వేరుశెనగ, ఇతర నట్స్ ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా అందిస్తాయి. మీరు వీటిని రోజువారీ స్నాక్స్‌లో లేదా కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.

సోయా బీన్- సోయా ఉత్పత్తులు: సోయా, సోయా ఆధారిత ఆహారాలు (ఉదాహరణకు టోఫు, సోయా చంక్స్) శాఖాహార ప్రోటీన్‌కు సూపర్ స్టార్స్. ఇవి కండరాలను నిర్మించడానికి, శక్తిని పెంచడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని కూర, సూప్ లేదా గ్రిల్ చేసి తీసుకోవచ్చు.

క్వినోవా: క్వినోవా అనేది ఒక సూపర్ ఫుడ్. ఇందులో అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. అంటే ఇది ఒక సంపూర్ణ ప్రోటీన్. ఇది ప్రోటీన్‌లోనే కాకుండా కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌కు కూడా మంచి మూలం. దీనిని సలాడ్, కిచిడీ లేదా స్నాక్స్‌లో చేర్చుకోవచ్చు.

Exit mobile version