మామూలుగా షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే చాలు చచ్చే వరకు పోదు. అయితే షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి ముఖ్యంగా తినే తిండి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా రావచ్చు. ఇక రక్తంలో షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుకోవడానికి మార్కెట్లో రకరకాల మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటితో పాటుగా కొన్ని రకాల ఫుడ్స్ ని కూడా తింటూ ఉంటారు.
అయితే మీరు కూడా రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి అనుకుంటే అందుకోసం కొన్ని రకాల ఫుడ్స్ ని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆ ఫుడ్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బెర్రీలు రక్తంలో చక్కెరను వాపును తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. అలాగే జీడిపప్పు బాదం పిస్తాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయట. సీ ఫుడ్ లో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే మెగ్నీషియం, ఫైబర్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్న బీన్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందించడానికి రక్తంలో చక్కెర లెవెల్స్ ని అదుపులో ఉంచడానికి బ్రోకలీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కేవలం ఈ ఆహార పదార్థాలు తినడం మాత్రమే కాకుండా ఆరోగ్య నిపుణుల సలహా మేరకు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయట.