Healthy: మనం తరచుగా అనారోగ్య లక్షణాల గురించి వింటూ ఉంటాం. కానీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలిపే 5 ముఖ్యమైన సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.
మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పే 5 సంకేతాలు
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం
రోజూ ఉదయాన్నే ఒకే సమయానికి అలారం అవసరం లేకుండా నిద్రలేవడం ఆరోగ్యకరమైన లక్షణం. దీని అర్థం మీ శరీరంలోని నేచురల్ రిథమ్ బలంగా ఉందని, మీ అంతర్గత గడియారం సరిగ్గా పనిచేస్తోందని అర్థం.
వేగంగా నడవడం
మీరు సహజంగానే వేగంగా నడిచే వారైతే, అది మీ లోయర్ బాడీ, కార్డియోవాస్కులర్ (గుండె సంబంధిత) ఆరోగ్యం మెరుగ్గా ఉందనడానికి సంకేతం. నెమ్మదిగా నడిచేవారి కంటే వేగంగా నడిచేవారు ఎక్కువ కాలం జీవిస్తారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉదయాన్నే ఆకలి వేయడం
నిద్రలేచిన తర్వాత త్వరగా ఆకలి వేయడం మీరు ఆరోగ్యంగా ఉన్నారనడానికి మంచి సూచన. దీని అర్థం మీ శరీర జీర్ణక్రియ, మెటబాలిజం, హార్మోన్లు అన్నీ క్రమ పద్ధతిలో పనిచేస్తున్నాయని అర్థం.
Also Read: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్ జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?
గాయాలు త్వరగా మానడం
మీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు అది త్వరగా నయమవుతుంటే, మీ రోగనిరోధక శక్తి బలంగా ఉందని అర్థం. ఇది మీ శరీరంలోని మైటోకాండ్రియల్, సెల్యులార్ రిపేర్ ప్రక్రియ ఆరోగ్యంగా సాగుతుందనడానికి నిదర్శనం.
చర్మం కాంతివంతంగా, స్పష్టంగా ఉండటం
శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ మెరుపు బయటకు కనిపిస్తుంది. మీ జీర్ణక్రియ మెరుగ్గా ఉండి, హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు మీ చర్మం మచ్చలు లేకుండా క్లియర్‌గా, కాంతివంతంగా కనిపిస్తుంది.
