Fresh Milk Cream: వెన్న.. అమృతం కన్న ఇది ఎంతో మిన్న

మీ డైట్ లో వెన్న ఒక భాగమా ? కాదా ? కాదంటే .. వెంటనే మీ డైట్ మెనూను మార్చుకోండి.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 06:18 AM IST

మీ డైట్ లో వెన్న ఒక భాగమా ? కాదా ? కాదంటే .. వెంటనే మీ డైట్ మెనూను మార్చుకోండి. వెన్నను కూడా మీ డైట్ లో భాగం చేసుకోండి. ఎందుకంటే దానివల్ల ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అతి సర్వత్రా వర్జయేత్.. కాబట్టి దేన్నైనా అతిగా వాడకుంటే మేలే జరుగుతుంది. వెన్న ను కూడా అంతే లిమిట్ గా వాడితే, ప్రయోజనాలన్నీ అందుతాయి. వెన్నలో రెండు రకాలు ఉంటాయి. అవి ఆవు వెన్న, గేదె వెన్న.
వీటిలో ఆవు వెన్న చాలా మంచిది. ఆవు వెన్న శరీరానికి దృఢత్వాన్ని, చలువను కలిగించడంతో పాటు తొందరగా జీర్ణం అవుతుంది.

కడుపులో మంట, గ్యాస్ ఉంటే..

కడుపులోమంట,గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు వెన్నలో కొంచెం పంచదార కలిపి తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
వెన్నలో ఉండే కొవ్వు సులభంగా జీర్ణం అయ్యి శరీరానికి శక్తిని ఇస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచి..

వెన్నెలో వివిధ రకాల విటమిన్లు (Vitamins), జింక్, మాంగనీస్, క్యాల్షియం, ప్రోటీన్, భాస్వరం, సెలీనియం వంటి అనేక పోషకాలతో (Nutrients) పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చి , హానికరమైన బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో  పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

కాలేయానికి ఆరోగ్యం, జీర్ణ సమస్యలకు చెక్..

వెన్న తినటం వలన కాలేయం ఆరోగ్యంగా ఉండి వ్యర్ధాలు అన్ని బయటకు పోతాయి. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, పేగు సంబంధిత ఇన్ ఫెక్షన్ లను తగ్గించడానికి వెన్న సమర్ధవంతంగా సహాయ పడుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణ సమస్యలను నివారించి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

యాంటీ క్యాన్సర్ గుణాలు..

వెన్నెలో యాంటీ క్యాన్సర్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి. దీంతో శరీరానికి క్యాన్సర్లతో పోరాడే సామర్థ్యం పెరిగి వివిధ రకాల క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చు.

చర్మ, శిరోజ సౌందర్యం..

వెన్నను చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవి చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా సహాయపడి చర్మం తేమగా ఉంటుంది. దీంతో చర్మం పొడిబారే సమస్యలు తగ్గి చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. వెన్న తో హెయిర్ మాస్క్ ను తయారు చేసుకొని వాడితే మన వెంట్రుకలు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది. వెన్నెలోని పోషకాలు మన జుట్టుకు బలాన్ని చేకూర్చుతాయి.

కంటికి రక్ష..

తాజా వెన్నలో విటమిన్ ఏ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీన్ని తింటే మన కంటికి చాలా మంచిది. నైట్ బ్లైండ్ నెస్, కేటారక్ట్ వంటి వంటి కంటి సమస్యలు దరి చేరకూడదంటే కనీసం అప్పుడప్పుడైనా వెన్న తినండి. కిడ్నీ సమస్యలున్న వారు వెన్న వంటి పాల ఉత్పత్తులను వినియోగించడం మంచిదని అంటారు.

మలబద్ధకానికి చెక్..

వెన్నను తీసుకుంటే మలబద్ధకం , గుండె, సంతానోత్పత్తి, స్థూలకాయం, నోటి దుర్వాసన వంటి వివిధ రకాల సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు. కనుక ఎటువంటి భయం లేకుండా పరిమితంగా వెన్నను తీసుకోండి.. ఆరోగ్యంగా.. అందంగా ఉండండి..