Site icon HashtagU Telugu

Black Pepper Benefits: నల్లమిరియాల్లో ఉన్న ఔషధ గుణాలేంటో తెలుసా..?

Blackpepper

Blackpepper

నల్ల మిరియాల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ప్రాచీన కాలంలో నల్లమిరియాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఆహార పదార్థాలకు మంచి రుచి ఇవ్వడమే కాదు…ఆరోగ్యానికి మేలు చేయడంతో వీటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్లు:
నల్లమిరియాల్లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ రూపంలో మన శరీరానికి నష్టం జరగకుండా చూస్తుంటాయి.కాలుష్యం, సిగరెట్లు, సూర్య కిరణాలకు మనశరీరం గురైనప్పుడు ఫ్రీ రాడికల్స్ ఏర్పడుతుంటాయి. ఇది శరీరంలో ఇన్ ఫ్లమేషన్, ముందస్తు వ్రుద్ధాప్యం, గుండె జబ్బులు , కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. కానీ మిరియాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఫ్రీరాడికల్స్ రూపంలో జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు:
ఇక తీవ్రమైన ఇన్ ఫ్లమేషన్ ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి సీరియస్ సమస్యలను కలిగించే ప్రమాదం ఉంటుంది. నల్లమిరియాల్లో ఉండే పిపరిన్ ఈ ఇన్ ఫ్లమేషన్ పై పోరాడుతుంది.

పోషకాల సంగ్రహణ:
మనం తీసుకునే ఆహారం నుంచి క్యాల్షియం, సిలీనియం వంటి కనీస పోషకాలను శరీరం గ్రహించేందుకు నల్లమిరియాలు సహాయపడుతుంటాయి. గ్రీన్ టీ, పసపులో ఉండే ప్రత్యేకమైన ఔషధ గుణాలు కూడా వీటిల్లో ఉన్నాయి.

పేగులకు మంచిది:
నల్లమిరియాలను డైరెక్టుగా తీసుకుంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పేగులు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలోనూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సాయపడుతుంది. దీనివల్ల పేగుల్లోని హానికారకాలు బయటకు వెళ్తాయి. ఇతర జీర్ణ సమస్యలు తగ్గేందుకు పనిచేస్తుంది.

చర్మానికీ మంచిదే:
చర్మంలోని పిగ్మెంట్లను కాపాడే లక్షణాలు మిరియాలకు ఉన్నాయి. చర్మం తెల్లగా పాలిపోవడం చూస్తుంటారు. దీన్ని పిగ్మెంటేషన్ అంటారు. అంటే చర్మతత్వాన్ని మిరియాలు కాపాడుతుంటాయి. అందుకే వంటింటి ఔషధ దినుసుగా మిరియాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆధునిక జీవనశైలి…మారిన ఆహారపు అలవాట్లు వంటింట్లో ఇవి కనిపించకుండా పోతున్నాయి.

Exit mobile version