Site icon HashtagU Telugu

Foods: పురుషులు తినకూడని 5 రకాల ఆహార పదార్ధాలు ఇవే.. తిన్నారో ఇక అంతే సంగతులు?

Foods

Foods

ప్రస్తుత రోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటికి గల కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలే. అయితే పురుషులు ఐదు రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. మరి ఆ ఐదు రకాల పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సోయా ఉత్పత్తులు.. పురుషులు తీసుకోకూడని ఆహార పదార్థాలలో సోయా ఉత్పత్తులు కూడా ఒకటి. సోయా ఉత్పత్తులలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉన్నాయి. ఫైటో ఈస్ట్రోజెన్‌లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

పురుషులు అధికంగా సోయా ఉత్పత్తులు చేసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా పురుషులు అసలు తీసుకోకూడదు. విస్తృతంగా ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకునే పురుషులకు అలాగే మహిళలకు ఇద్దరికీ అనారోగ్యం. ట్రాన్స్ ఫ్యాట్స్ సాధారణంగా వేయించిన, ప్యాక్ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావాన్ని చూపుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాలు ప్రాసెస్ చేసిన మాంసం కూడా వివిధ రకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. మాంసాహార వంటకాలు తీసుకోవడం వలన తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది.

పురుగు మందులు.. పురుగుమందులు మనం తినే కూరగాయలు పండ్లపై విరివిగా ఉపయోగిస్తుంటారు. పురుగు మందులలోని కొన్ని రసాయనాలు నాన్ స్టిక్ వంట పాత్రల ద్వారా కూడా వస్తాయి. సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్ల మాదిరిగానే, జెనోఈస్ట్రోజెన్‌లు కూడా స్పెర్మ్‌పై ప్రభావాన్ని చూపిస్తాయి. అధిక కొవ్వు పాల ఉత్పత్తులు అనగా పాలు, క్రీమ్, జున్ను ఇలా అనేక రకాల పాల ఉత్పత్తిలో మనకు దొరుకుతూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల స్పెర్మ్‌లోని చలనశీలతను తగ్గిస్తాయి. వాస్తవానికి, వీటిలో కొన్ని పశువులకు ఇచ్చే సెక్స్ స్టెరాయిడ్స్ వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. ప్రాసెస్ చేసిన మాంసం కూడా వివిధ రకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. మాంసాహార వంటకాలు తీసుకోవడం వలన తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది.