Foods: పురుషులు ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు తిన్నారంటే అంతే సంగతులు?

సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాము. కానీ అందులో కొన్ని

  • Written By:
  • Publish Date - January 21, 2023 / 06:30 AM IST

సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాము. కానీ అందులో కొన్ని రకాల ఆహారాలను తీసుకోకపోవడం మంచిది. అలా పురుషులు కూడా ఐదు రకాల ఆహార పదార్థాలుతినకుండా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. మరి ఆ ఐదు ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సోయా ఉత్పత్తులలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. ఈ ఫైటో ఈస్ట్రోజెన్‌లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది..

బోస్టన్‌లోని సంతానోత్పత్తి క్లినిక్‌లలో చేసిన అధ్యయనం ప్రకారం 99 మంది పురుషులు అధికంగా సోయా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్.. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషులతో పాటు మహిళలకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ సాధారణంగా వేయించిన, ప్యాక్ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలలో చూడవచ్చు. ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే పురుషులు ఎక్కువగా ప్రాసెస్ చేసిన మాంసం తినకూడదు. అలాగే మాంసాహార వంటకాలు తీసుకోవడం వల్ల తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది. మనకు మార్కెట్ లో దొరికే కాయగూరలు, పండ్లపై పురుగుమందులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

పురుగు మందులలోని కొన్ని రసాయనాలు నాన్ స్టిక్ వంట పాత్రల ద్వారా కూడా వస్తాయి. సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్ల మాదిరిగానే, జెనోఈస్ట్రోజెన్‌లు కూడా స్పెర్మ్‌ పై ప్రభావాన్ని చూపిస్తాయి. అధిక కొవ్వు పాల ఉత్పత్తులు స్పెర్మ్‌లోని చలనశీలతను తగ్గిస్తాయి. వాస్తవానికి, వీటిలో కొన్ని పశువులకు ఇచ్చే సెక్స్ స్టెరాయిడ్స్ వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి పురుషులు ఎక్కువ మొత్తంలో పాల ఉత్పత్తులు తీసుకోకపోవడం మంచిది.