Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

ఈ రెండింటిలో ఏది ప్రమాదకరం ? అంటే.. లో బ్లడ్ ప్రెషర్! ఎందుకంటే దీని వలన మెదడుకు ఆక్సిజన్ , అవసరమైన పోషకాల సరఫరా ఆగిపోతుంది.

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 07:31 AM IST

హై బీపీ.. లో బీపీ..
ఈ రెండింటిలో ఏది ప్రమాదకరం ? అంటే.. లో బ్లడ్ ప్రెషర్! ఎందుకంటే దీని వలన మెదడుకు ఆక్సిజన్ , అవసరమైన పోషకాల సరఫరా ఆగిపోతుంది. చాలా ప్రమాదకర పరిస్థితులను ఇది ఏర్పరుస్తుంది. కాబట్టి లో బీపీ ఉంటే .. ఆరోగ్య పరిస్థితిని విస్మరించకుండా, తగిన జాగ్రత్తలను తీసుకోవాలి.కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషధాలు, ఆహార పదార్థాలను క్రమంగా తినటం వల్ల లో బ్లడ్ ప్రెషర్ నుంచి కోలుకోవచ్చు.

వైద్య శాస్త్రం ప్రకారం డయాస్టోలిక్ ప్రెజర్ 95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ 140 mmHg మించకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్లే. ఇది మహిళల్లో 60/100 , మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్లే. మనకు లోబీపీ ఉందా లేదా అన్నది కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

సాధారణంగా బ్లడ్ ప్రెజర్ అనేది మానవుల వయసు, లింగనిర్థారణ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.మన దేశంలో హైబీపీపై జరుగుతున్నంత చర్చ… లోబీపీపై జరగట్లేదు. ఎందుకంటే ఇది ఆడవారిలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆడవారికి లో బీపీ ఉన్నా.. సకాలంలో వైద్య పరీక్షలు చేయించక అది బయటపడటం లేదు.ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ రక్తస్రావం అయితే అది లోబీపీకి దారి తియ్యవచ్చు. కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్టుల వల్ల కూడా లోబీపీ వచ్చే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే లోబీపీ ఉందంటే… శరీరంలో సరిపడా రక్తం లేదని అర్థం. అందువల్ల లోబీపీ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లడం మంచిది. నీరు సరిపడా తాగాలి. రక్తం పడే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఎలాంటి టెన్షన్స్‌ ని దరిచేరనీయకండి. ప్రతిరోజూ తప్పకుండా ఎక్సర్‌ సైజులు చేయండి.

లో బీపీ ముఖ్య కారణాలు..

* డీ హైడ్రేష‌న్‌ వల్ల వాంతి, విరేచ‌నాలు
* బ్లీడింగ్‌- మధ్యస్థాయి నుంచి తీవ్ర స్థాయి దాకా
* అవ‌యవాల వాపు, నొప్పి
* రుగ్మ‌త‌లు- గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం, గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం లాంటివి
* విట‌మిన్ బీ12 లోపం
* అడ్రిన‌లైన్ హార్మోన్ స‌రైన మోతాదులో లేకపోవడం
* సెప్టిసీమియా
* వేసో వ్యాగ‌ల్ రియాక్ష‌న్‌లు
* పోస్టుర‌ల్ హైపో టెన్ష‌న్
* మ‌ద్యం సేవించ‌డం
* మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అతిగా సేవించ‌డం

విటమిన్లు అవసరం..

విట‌మిన్ బీ12, విటమిన్ ఇ అనేవి లో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. హై బీపీ ఉన్న‌వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విట‌మిన్ ఇ తీసుకోకూడ‌దు. విట‌మిన్ బీ 12 అనీమియా చికిత్స‌లో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇదే బీపీని పెంచ‌డంలోనూ స‌హ‌క‌రిస్తుంది. ఈ విట‌మిన్ల‌ను కోరుకునే వారు బాదంప‌ప్పు, పాల‌కూర‌, స్వీట్ పొటాటో, గుడ్లు, పాలు, చీజ్‌, చేప‌లు తినాలి. దీనికి అద‌నంగా వైద్యుడి స‌లహాతో విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను కూడా తీసుకోవచ్చు.

ఇలా చేస్తే లో బీపీకి చెక్..

* రోజూ భోజనం తర్వాత ఒక కప్ కాఫీ తాగండి. కాఫీలోని కెఫిన్ అనే పదార్థం లో బీపీని కంట్రోల్ లో ఉంచేందుకు దోహదం చేస్తుంది.

* బ్రెడ్, బియ్యం, షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, బంగాళాదుంపల్లో కార్బో హైడ్రేట్స్ ఎక్కువ. వీటిని ఎక్కువ తీసుకుంటే లో బీపీ ముప్పు పెరుగుతుంది. ప్రోటీన్లు, బీన్స్, హోల్ గ్రెయిన్స్ ను తింటే మంచిది.

* కంటి నిండా నిద్రపోవాలి.

* భోజనం అతిగా తీసుకోవద్దు. మితాహారం మేలు.

* నీళ్లు బాగా తాగండి.