Live Longer: జపనీస్ సీక్రెట్స్ తెలుసుకోండి.. లైఫ్ టైం పెంచుకోండి..!

ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే మనుషులు ఉండే దేశం జపాన్ (Japan). 100 సంవత్సరాలు దాటిన వృద్ధుల సంఖ్య జపాన్ లో ఎక్కువ. జపాన్ ప్రజలు బాగా అభివృద్ధి చెందిన జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ అమెరికా, బ్రిటన్, కెనడా ప్రజల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 12, 2023 / 04:00 PM IST

ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే మనుషులు ఉండే దేశం జపాన్ (Japan). 100 సంవత్సరాలు దాటిన వృద్ధుల సంఖ్య జపాన్ లో ఎక్కువ.
జపాన్ ప్రజలు బాగా అభివృద్ధి చెందిన జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ అమెరికా, బ్రిటన్, కెనడా ప్రజల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కారణం ఏమిటి? జపాన్ ప్రజల ఆరోగ్య రహస్యాలు ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఆయుష్షును కూడా పెంచుకుందాం..!

జపాన్ ప్రజల ఆరోగ్యం బాగా ఉంటోంది కాబట్టే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆరోగ్యం బాగా ఉండటానికి వారు మంచి ఆహారం తీసుకుంటున్నారు. జపాన్ ప్రజల జీవన శైలి కూడా చాలా బాగుంటుంది. ఈమేరకు వివరాలతో కూడిన నివేదిక “యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినిక్ న్యూట్రిషన్‌”లో ప్రచురితమైంది. అందులోని ఇంకొన్ని వివరాలను, ఇతర విశ్లేషణలను టూకీగా తెలుసుకుందాం..!

■ వీటికి దూరంగా ఉంటారు

★ జపాన్ ప్రజలు కొవ్వు తో కూడిన ఫుడ్స్ కు దూరంగా ఉంటారు. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కు దూరంగా ఉంటారు.
★అధిక స్యాచురేటెడ్ ఆహారాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) లెవల్స్ ను పెంచుతాయి.ఇది మైనపు లాంటి పదార్ధం. మీ ధమని గోడలపై పేరుకుపోతూ ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే అధిక స్యాచురేటెడ్ ఆహారాలను జపాన్ ప్రజలు ఎక్కువగా తీసుకోరు.
★ సాస్, వెన్న, నెయ్యి, పందికొవ్వు, క్రీమ్, జున్ను, కేకులతో పాటు పామాయిల్ తో చేసిన స్ట్రీట్ ఫుడ్ ను ఎక్కువ తినరు.ఎక్కువ షుగర్ ఉండే ఫుడ్ కూడా జపనీస్ ఇష్టపడరు.

■ వీటిని తినేందుకు ప్రయార్టీ

★ జపాన్ ప్రజలు బియ్యం అన్నం చాలా తక్కువగా తింటారు.
★ జపాన్‌లో వంటకాలను ఉడకబెట్టడం, ఆవిరి చేయడం లేదా బేకింగ్ చేయడం ద్వారా తయారుచేస్తారు.
★ వంటలలో నూనె, మసాలాలు అతి తక్కువగా వాడుతారు.
★ పండ్లు, పాలు, కూరగాయలు, ఆకు కూరలు, తృణధాన్యాలు, చేపలు, గుడ్లు, మాంసం, సోయా ఉత్పత్తులను ఫుడ్ లో ఎక్కువగా వాడుతుంటారు.
★ జపనీస్ ప్రజలకు టీ తాగడం చాలా ఇష్టం. గ్రీన్ టీ అంటే వారికి మహా ఇష్టం. గ్రీన్ టీలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. గ్రీన్ టీ వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది.
★ సీవీడ్ అనేది ఒక రకమైన పాకురు. జపాన్ దేశస్తులు రోజూ దీన్ని ఫుడ్స్ లో తింటారు. ఇందులో A, C, E విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
★జపాన్ వాళ్ళు మిసో, నాట్టో, సోయా, టేంపే, సోయా సాస్ వంటి పులియబెట్టిన ఫుడ్స్ ఎక్కువగా తింటారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.

■ అన్నం తినేటప్పుడు వెరీ డిసిప్లైన్

జపాన్ ప్రజలు ఒక ప్లేట్‌లో చాలా తక్కువ ఆహారాన్ని తీసుకొని చాలా నెమ్మదిగా తింటారు. వారు చిన్న పలకలలో లేదా గిన్నెలలో ఆహారం తింటారు. తినేటప్పుడు టీవీ లేదా మొబైల్ చూడటం ఇష్టపడరు. ఆహారంపైనే పూర్తి శ్రద్ధ పెడతారు. చూపుతారు. వారు నేలమీద కూర్చుని చాప్‌స్టిక్‌లతో తింటారు. ఫలితంగా స్లోగా ఫుడ్ తీసుకుంటారు.

 ■ ఎక్కువసేపు కూర్చోవడానికి ఇష్టపడరు

★ జపాన్ ప్రజలకు ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు.
★వారు రోజూ చాలా దూరం నడుస్తారు.
★జపాన్ లో పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ వాకింగ్ , సైక్లింగ్, జాగింగ్ చేయడం అంటే చాలా ఇష్టం.
★జపాన్ ప్రజలు రైలులో కూడా ఎక్కువసేపు నిలబడటానికే ప్రయార్టీ ఇస్తారు.
★ జపాన్ వాళ్ళు ఉదయాన్నే జిమ్ వెళ్ళడానికి ప్రయార్టీ ఇవ్వరు. వాకింగ్ , సైక్లింగ్, జాగింగ్ తో సరిపెడతారు. ఇళ్ల దగ్గరే Asa taisou అనే వ్యాయామాన్ని ప్రాక్టీస్ చేస్తారు.

■ జపాన్ చిన్నారుల ఆరోగ్య రహస్యాలు ఇవీ

★ జపాన్ పిల్లల ఆరోగ్య రహస్యం.. వారికి పాఠశాలలో ఇచ్చే మధ్యాహ్న భోజనమే. మధ్యాహ్న భోజనంలో తక్కువ క్యాలరీలున్న, ఎక్కువ పోషకాలున్న, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఇస్తారు. పిల్లల మధ్యాహ్న భోజనంలో కాల్చిన చేపలు, స్వీట్ కార్న్, సూప్, పాలు వంటివి ఉంటాయి. వీటిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.
★ జపనీస్ పిల్లల ఆహారంలో పిజ్జా లేదా పాస్తాకు బదులుగా  బ్రౌన్ రైస్ ఉంటుంది.
★జపాన్ లో 98.3 శాతం మంది పిల్లలు కాలినడకన లేదా సైకిల్‌పై స్కూలుకు వెళ్లారు.ఇది కూడా వారి హెల్స్ బెటర్ గా ఉండేలా చేస్తోంది. ఫలితంగా వారిలో ఊబకాయం సమస్య ఉండదు.
★ జపాన్ లోని పాఠశాలలో విద్యార్థులు శారీరక శ్రమకు కూడా ప్రాధాన్యత ఇస్తారు.