Site icon HashtagU Telugu

Mushroom Side Effects: సైడ్ ఎఫెక్ట్స్ కు “పుట్ట”.. ఇష్టం వచ్చినట్టు తింటే ఇక్కట్లే!!

Mushroom

Mushroom

పుట్టగొడుగులు (మష్రూమ్స్) తింటే ఆరోగ్యానికి మంచిదే. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. జీర్ణకోశ, శ్వాస కోశ,
కాలేయ, రోగ నిరోధక వ్యవస్థ కు సంబంధించిన, కొలెస్ట్రాల్ తో ముడిపడిన వ్యాధుల ముప్పు నుంచి రక్షించే ఔషధ గుణాలు పుట్ట గొడుగుల్లో ఉంటాయి. మష్రూమ్ అనేది అడవుల్లో మొక్కకు పూచే ఒక పండు లాంటిది. అధిక ఉష్ణోగ్రత తో కూడిన వాతావరణ పరిస్థితుల్లో పుట్ట గొడుగు పెరిగి పెద్దది అవుతుంది. ఈక్రమంలో వాటిని చక్కగా క్లీన్ చేశాకే వండాల్సి ఉంటుంది. ఏమాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని వండుకొని తింటే సైడ్ ఎఫెక్ట్స్ ముసురుకొని ముప్పుతిప్పలు పెడతాయి.

మష్రూమ్స్ .. సైడ్ ఎఫెక్ట్స్.. బీ అలర్ట్

* మష్రూమ్స్ ఫంగస్ జాతికి చెందినవి.వీటిని తినడం వల్ల కొందరిలో వాంతులు, విరేచనాలు కావచ్చు. అందరూ వీటిని తినగలరు.. అందరి శరీర తత్వానికి ఇవి సరిపోతాయని కచ్చితంగా చెప్పలేం.

* ఉడికిన పుట్టగొడులను లేదా.. వండకుండా పుట్టగొడుగులను తింటే అలర్జీ ఏర్పడుతుంది.
మష్రూమ్స్ తింటే స్కిన్ అలర్జీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫలితంగా చర్మం పై దద్దుర్లు, పొక్కులు వచ్చే ముప్పు ఉంటుంది. వీటిని తొలిసారి తినేవాళ్ళు చాలా స్వల్ప మోతాదులో తీసుకోవడం శ్రేయస్కరం.

* కొన్ని రకాల పుట్టగొడుగులను తినడం వల్ల మీ మెదడు పనితీరు కొత్త సమయం పాటు మొద్దుబారిన విధంగా తయారవుతుంది. ఫలితంగా మీరు పరధ్యానంగా కాసేపు గడుపుతారు. సైలో సైబీన్ అనే రసాయనిక పదార్థాన్ని కొన్ని జాతుల పుట్ట గొడుగులు మన శరీరంలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల మన మెదడు యాక్టివ్ నెస్ ను కోల్పోయిన ఫీలింగ్ మనకు కాసేపు కలుగుతుంది.

* పుట్ట గొడుగులను తిన్నాక కొందరికి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. తీవ్ర అలసటగా ఫీల్ అవుతారు. బాడీలో ఎనర్జీ లెవల్ బాగా తగ్గిపోయిందా అనేలా మీకు మీరే భ్రమ పడతారు.

వివిధ రకాల వంటకాల్లో..

పుట్టగొడుగులను వివిధ రకాల వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. వీటిని సూప్ మరియు సలాడ్లలో ఉపయోగిస్తారు. గుడ్లు వంటి ఇతర ఆహార పదార్థాలతో, ఆకలిని ప్రేరేపించడానికి, శాండ్‌విచ్‌లలో ఇతర కూరగాయలతో పాటు కలుపుతారు. పిజ్జాల కోసం పాస్తా సాస్ , టాపింగ్స్‌ను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పుట్టగొడుగులకు అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92% నీటిని కలిగి ఉంటాయి మరియు పొటాషియం మరియు సోడియం యొక్క మంచి సమతుల్యతను కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.