Site icon HashtagU Telugu

Hair Gels: హెయిర్ జెల్స్ వాడొచ్చా..? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?

Hair Gel

Resizeimagesize (1280 X 720) (5) 11zon

జుట్టును స్టైలిష్ చేసుకోవడానికి చాలామంది హెయిర్ జెల్స్ (Hair Gels)ను వాడుతుంటారు. అయితే వాటిలోని విషపూరిత రసాయనాల కారణంగా కొందరిలో జుట్టు, తల, చర్మంపై సైడ్ ఎఫెక్ట్స్ పడతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!

■ హెయిర్ జెల్స్‌ లోని కెమికల్స్, కాలుష్య కారకాలతో కలిసి

హెయిర్ జెల్స్‌ను అధికంగా వాడటం వల్ల మీ జుట్టు డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఫలితంగా జుట్టు రాలే అవకాశాలు పెరుగుతాయి. హెయిర్ జెల్స్‌ లో కొన్ని రసాయనాలు ఉంటాయి. వాతావరణంలోని కాలుష్య కారకాలు, ధూళి, నెత్తిలోని అదనపు సెబమ్‌లకు ఈ రసాయనాలు ప్రతిస్పందిస్తాయి. ఇది జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది.

■ చుండ్రు

డీ హైడ్రేషన్, పోషకాహార లోపం కలిగిన చర్మం ఉన్నవాళ్లు హెయిర్ జెల్స్‌ వాడితే చుండ్రు సమస్య వస్తుంది. సెబమ్, తలపై మూసుకుపోయిన చర్మ రంధ్రాల వల్ల చుండ్రు ప్రాబ్లమ్ వస్తుంది. ఇవి ఉన్నవారు హెయిర్ జెల్ కి దూరంగా ఉంటే బెస్ట్.

■ పొడి జుట్టు

హెయిర్ జెల్స్‌లో ఉండే రసాయనాలు జుట్టు, తలమీద తేమను తొలగించి డీ హైడ్రేషన్ కు కారణమవుతాయి. హెయిర్ జెల్స్‌ను అధికంగా వాడటం వల్ల తల మీద తేమ తగ్గుతుంది. పొడి, పెళుసైన జుట్టుకు ఇది దారి తీస్తుంది. హెయిర్ జెల్స్ తలపై సెబమ్ ఉత్పత్తిని కూడా నిరోధి స్తాయి. దురద, చుండ్రుకు సైతం అవి కారణమవుతాయి.

■ రంగుకు దెబ్బ

హెయిర్ జెల్ వాడటం వల్ల జుట్టు రాలుతుంది. జుట్టు సన్నబడుతుంది. హెయిర్ జెల్ మీ జుట్టు యొక్క నల్ల రంగును తొలగిస్తుంది. ఇది మీ జుట్టుపై నుంచి పోషకాలు, తేమను తొలగిస్తుంది. pH స్థాయికి అంతరాయం కలిగిస్తుంది.

■ జుట్టు చిట్లిపోతుంది

హెయిర్ జెల్స్‌ను అధికంగా వాడటం వల్ల జుట్టు పోషణకు అంతరాయం కలుగుతుంది. తలపై ఉండే తేమను తొలగిస్తుంది. జుట్టును బలహీనపరుస్తుంది. ఇవన్నీ చివరికి మీ జుట్టు చిట్లి పోవడానికి దారితీస్తాయి. తల అధికంగా పొడిబారడం వల్ల జుట్టు చిట్లిపోయే ప్రాబ్లమ్ వస్తుంది.

■ అన్ని హెయిర్ జెల్స్ చెడ్డవా..?

లైసెన్స్ పొందిన కొందరు కాస్మోటాలజిస్ట్ ల ప్రకారం.. “అన్ని హెయిర్ జెల్స్ చెడ్డవి కావు. కానీ జెల్‌ను రోజూ జుట్టుకు మళ్లీ మళ్లీ అప్లై చేస్తే నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు”.

■ హెయిర్ జెల్‌ పెట్టుకొని నిద్రించవచ్చా..?

“హెయిర్ జెల్‌ పెట్టుకున్నాక జుట్టు పొడిగా ఉన్నంత వరకు నిద్రించడం ఆమోద యోగ్యమైనది. ఒకవేళ జెల్ తడిగా ఉంటే.. జుట్టు క్యూటికల్ షాఫ్ట్‌ల మధ్య స్క్రాచ్ వస్తుంది. ఫలితంగా ఈ క్యూటికల్స్ పొడిబారుతాయి. పర్యవసానంగా జుట్టు చిట్లిపోతుంది” అని నిపుణులు చెప్పారు.

■ హెయిర్ జెల్‌ను ఎలా తొలగించాలి..?

మీరు ఒకవేళ హెయిర్ జెల్‌ ను తరచుగా ఉపయోగిస్తుంటే.. జెల్ బిల్డప్‌ను తలపై నుంచి తొలగించడానికి క్లారిఫైయింగ్ షాంపూని ఉపయోగించమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

■ హెయిర్ స్ప్రే లేదా హెయిర్ జెల్ ఏది మంచిది..?

హెయిర్‌ స్ప్రే మరియు హెయిర్ జెల్ రెండూ ఆల్కహాల్ కలిగి ఉంటాయి. అయితే వీటిలో జెల్ అనేది స్ప్రే కంటే మెరుగైనది. ఎందుకంటే దానిని మరుసటి రోజు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు.

■ ప్రతిరోజూ హెయిర్ జెల్ ఉపయోగించవచ్చా..?

ఒకవేళ మీరు ప్రతిరోజూ హెయిర్ జెల్‌ను ఉపయోగిస్తే .. దానికి సంబంధించిన జిడ్డు అవశేషాలను తొలగించడానికి ప్రతి రాత్రి దానిని కడగాలి. ఇందుకోసం  ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం ఆరోగ్యకరం కాదు. దీనివల్ల మీ జుట్టు పొడిబారుతుంది. కాబట్టి మీ జుట్టుకు ప్రతిరోజూ హెయిర్ జెల్ ఉపయోగించవద్దు.

■ జెల్‌కు బదులుగా ఏమి ఉపయోగించగలను..?

మీరు హెయిర్ జెల్ కు బదులుగా సహజ నూనె లేదా డిటాంగ్లింగ్ సీరమ్‌ వాడొచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. హెయిర్ హోల్డ్ ను మునుపటి కంటే బెటర్ చేయడానికి మీరు హెయిర్ స్ప్రేని ఉపయోగించవచ్చు.

■ జెల్ కంటే హెయిర్ వాక్స్ మంచిదా..?

మీ ప్రాధాన్యతను బట్టి మీరు దేనినైనా ఉపయోగించవచ్చు.  హెయిర్ జెల్ అనేది హెయిర్ వాక్స్ లాగా మందంగా ఉండదు. కానీ హెయిర్ వ్యాక్స్ మీ జుట్టును హెయిర్ జెల్ లాగా బిగుతుగా మార్చదు.