Polluted Weather: కాలుష్యంలో తిరుగుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్ తాగాల్సిందే?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాహన కొనుగోలు దారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వాహనాల సంఖ్య కూడా

  • Written By:
  • Publish Date - December 2, 2022 / 06:30 AM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ వాహన కొనుగోలు దారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో వాతావరణం కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. మరి ముఖ్యంగా ప్రధాన నగరాలలో అయితే మాస్క్ లేకుండా ట్రాఫిక్ లోకి వెళ్లడం అన్నది చాలా కష్టతరంగా మారింది. ప్రజలు కూడా మాస్కులు లేకుండా బయటకు రావాలి అంటే భయపడుతున్నారు. కాగా ఈ కాలుష్యం కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ, చర్మ సమస్యలతో పాటు మొదలైనవి సంక్రమిస్తాయి. ఇలా కాలుష్యంలో తిరిగేవారు కొన్ని రకాల ద్రవ పదార్థాలు తాగడం వల్ల మంచిది. మరి ఎటువంటి ద్రవపదార్థాలు తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇలా ట్రాఫిక్ లో అలాగే కాలుష్య వాతావరణం లో ఉన్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం మంచిది. ఆ విధంగా చేయడం వల్ల తీసుకున్న ఆహారంలో ఉండే కొవ్వు, ఆయిల్ లపై గాలిలో ఉండే కాలుష్యం కారణంగా ఆహారం కలుషితమవుతుంది. అలాగే గ్రీన్ టీ తాగడం కూడా ఎంతో మంచిది. గ్రీన్ టీ తాగడం వల్ల అందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, గొంతులో దురద వంటి లక్షణాల నుంచి మనం పొందడానికి గ్రీన్ టీ ఎంతో బాగా పనిచేస్తుంది.

టమోటాలలో విటమిన్ సి అధికంగా ఉండి శరీరంలో నిరోధక శక్తిని వేగవంతం చేస్తుంది. వీటిలో నీటి స్థాయితో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామంది రాత్రి సమయంలో డిన్నర్ కు బదులుగా టమాటా సూప్ తీసుకుని పడుకుండిపోతారు. దీనిని జూస్ లా తీసుకున్నా లేదా సూప్ లా తీసుకున్నా మంచిది. అందులో కొంచెం మిరియాల పొడి కలుపుకుంటే తాగడం మరింత మంచిది. అలాగే కాలుష్యంలో తిరిగేవాళ్లు సిట్రస్ అనగా విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిది. విటమిన్ సి పెంచుతాయి. ఆరెంజ్ జ్యూస్ ని తాగడం ఇంకా మంచిది.