Site icon HashtagU Telugu

Mosquito Ring: ఏంటి.. ఈ ఉంగరం వేలికి పెట్టుకుంటే దోమలు దగ్గరకి రావట! ఇందులో నిజమెంత?

Masquito Ring

Masquito Ring

వర్షాకాలం వచ్చింది అంటే చాలు.. నిల్వ ఉన్న నీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ దొమల బెడద కారణంగా రాత్రి సమయంలో సరిగా నిద్ర కూడా పట్టదు. చాలామంది ఈ విషయంలో విసుగు చెందుతూ ఉంటారు. అయితే అటువంటి వారికి ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే దోమలు కుట్టకుండా ఉండటం కోసం ఒక రింగ్ వచ్చేసింది. ఆ రింగును పెట్టుకుంటే దోమలు దరిదాపుల్లోకి కూడా రావట.

జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్సిటీ హలే విటెన్ బర్గ్ కు చెందిన పరిశోధకులు త్రీడీ సాంకేతికతతో ఒక ఉంగరాన్ని తయారు చేశారు. దోమలు అలాగే ఇతర కీటకాలు ఎక్కువ కాలం దూరంగా ఉంచడానికి శాస్త్రవేత్తలు కొత్త 3డి ప్రింటింగ్ వేరబుల్ రింగును అభివృద్ధి చేశారు. ఒక సాధారణ క్రిమి వికర్షకం ఏఆర్ 3535 ని ఉపయోగించి నమూనాను అభివృద్ధి చేశారు. ఏఆర్ 3535 కలిగిన దోమల స్ప్రే చర్మంపై చాలా సున్నితంగా ఉంటుందట.

దీన్ని చాలా సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నామని వాడు తెలిపారు. కాగా ఈ సాధారణంగా స్ప్రే లేదంటే లోషన్ రూపంలో ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని గంటలపాటు రక్షణను అందిస్తుంది అని వాళ్ళు తెలిపారు.