Anthrax: దేశంలో మ‌రో వ్యాధి విజృంభ‌ణ‌.. ల‌క్ష‌ణాలు, నివార‌ణ చ‌ర్య‌లు ఇవే..!

  • Written By:
  • Publish Date - June 1, 2024 / 12:00 PM IST

Anthrax: కరోనా తర్వాత దేశంలో మరో వ్యాధి విజృంభించింది. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆంత్రాక్స్ (Anthrax) వ్యాధికి మొదటి టార్గెట్‌గా మారారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఒడిశాలోని కోరాపుట్ జిల్లా వాసులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేసింది. వ్యాధి సోకిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంత్రాక్స్‌ బారిన పడి చనిపోయిన ఆవుతో ఈ ముగ్గురికి సంబంధం ఉండ‌టంతో ఈ వ్యాధి సోకింద‌ని చెబుతున్నారు. ఈ ముగ్గురికి ఆంత్రాక్స్ అనే వ్యాధి సోకిందని ఆరోగ్య అధికారి తెలిపారు. ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.

పరిస్థితి అదుపులో ఉంది

కోరాపుట్ అదనపు జిల్లా వైద్యాధికారి (వ్యాధుల నియంత్రణ) సత్య సాయి స్వరూప్ ప్రకారం.. ప్రస్తుతం వారి పరిస్థితి అదుపులో ఉందని, కొత్త కేసులు ఏవీ నివేదించబడలేదని తెలిపారు. ఆంత్రాక్స్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు కృషి చేశామన్నారు. అదనంగా ప్రభావిత ప్రాంతాల్లో సమాచారం, విద్య, కమ్యూనికేషన్ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, రాబోయే కొద్ది రోజుల్లో పరిస్థితిని అంచనా వేయడానికి గ్రామం, దాని పరిసర ప్రాంతాలలో తగినంత ఆరోగ్య అధికారులను మోహరించినట్లు ఆయన చెప్పారు.

Also Read: Telangana Formation Day : గన్‌పార్క్‌ చుట్టూ ఇనుప కంచె..ఇదేనా కాంగ్రెస్ ఇచ్చే గౌరవం – BRS

ఈ ఆంత్రాక్స్ వ్యాధి ఏమిటి?

ఇప్పటికే చాలా చోట్ల ఈ వ్యాధి వచ్చింది. ఇది మట్టిలో కనిపించే వ్యాధికారక బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా మట్టిలో కలిసినప్పుడు పెంపుడు జంతువులకు సులభంగా చేరుతుంది. జంతువులతో లేదా వాటి పాల ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఇది మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది శ్వాస తీసుకోవడం, కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు తాగడం లేదా చర్మ గాయాల ద్వారా శరీరానికి చేరుతుంది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది మరణానికి కూడా దారి తీస్తుంది.

లక్షణాలు ఇవే

  • చర్మంపై బొబ్బలు రావడం
  • తీవ్ర జ్వరం
  • ఛాతీలో అసౌకర్యం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • వాంతులు
  • కడుపు, తల, శరీరంలో నొప్పి
  • రోజంతా అలసట

ఇదే నివారణ

పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఈ బాక్టీరియా శరీరంలోకి చేరిన తర్వాత పెద్ద మొత్తంలో విష పదార్థాలను విడుదల చేస్తుంది. కాబట్టి దానిని ఆపడానికి యాంటీటాక్సిన్ మందులు ఇస్తారు. దీన్ని నివారించడానికి మీరు టీకాలు కూడా తీసుకోవచ్చు.