Ayurveda Tips: ఎసిడిటీ, కడుపు ఉబ్బరం ప్రాబ్లమ్స్ కు 3 ఆయుర్వేద చికిత్సలు

ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలు ఎంతోమందిని వేధిస్తుంటాయి. ఎసిడిటీ అంటే ఏమిటి ?

ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలు ఎంతోమందిని వేధిస్తుంటాయి. ఎసిడిటీ అంటే ఏమిటి ? కడుపు ఉబ్బరం అంటే ఏమిటి ? ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ఇవి వచ్చినప్పుడు మనకు సహాయపడే 3 ఆయుర్వేద (Ayurveda) చికిత్సలను ఆయుర్వేద (Ayurveda) వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిని 12 వారాల పాటు తీసుకుంటే చాలావరకు రిలాక్స్ అవుతారని అంటున్నారు. అవేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర టీ

కొత్తిమీర టీతో మీ రోజును ప్రారంభించండి. దీని కోసం ఒక గ్లాసు నీరు (300 మి.లీ.) తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర గింజలు, 5 పుదీనా ఆకులు, 15 కరివేపాకులను వేసి 5 నిమిషాలు ఉడకబెట్టి , వడకట్టి తాగండి.

ఫెన్నెల్ సీడ్స్ (సోంపు గింజలు)

సోంపు గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ప్రతి భోజనం తర్వాత ఒక టీ స్పూన్ సోంపు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.

రోజ్ టీ

గులాబీ పువ్వు నుంచి తయారయ్యే టీని రోజ్ టీ అంటారు. గులాబీ పువ్వు.. అందానికి, సువాసనకు ప్రసిద్ధే కాదు.. ఔషధం కూడా. ఆయుర్వేద టీలల్లో ఇది ఒకటని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు రోజ్ వాటర్ తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.  1 కప్పు నీరు (150 మి.లీ.) తీసుకుని 3 నిమిషాలు ఉడకబెట్టి.. అందులో కొన్ని పొడి గులాబీ రేకులను (1 టీస్పూన్) వేయాలి. ఆ తర్వాత 5 రోజ్ టీని వడకట్టి తాగండి. గులాబీ టీ వేగవంతంగా బరువు తగ్గడంలో కూడా సహాయ పడుతుందని అంటారు. రోజ్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుందని, జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోజ్ టీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

ఎసిడిటీ

ఎసిడిటీ సమస్య వస్తే ఏం తినాలన్నా.. ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతుంది. పుల్లటి తేన్పులు.. ఛాతిలో మంట.. గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉండటం వంటి లక్షణాలు ఇబ్బందిపెడతాయి.

ఎసిడిటీ ఉన్నవారికి టిప్స్

  1. రోజు ఉదయాన్నే పరికడుపున పుదీనా ఆకులు నమలండి.
  2. కాఫీ, టీలకు, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.
  3. హెర్బల్ టీ తాగొచ్చు.
  4. రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగండి.
  5. మధ్యాహ్న భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని తీసుకోండి.
  6. మధ్యాహ్న భోజనం తర్వాత లవంగాలను బుగ్గలో పెట్టుకోండి. దీనవల్ల ఎసిడిటీ సమస్య ఉండదు. లవంగాల్లో ఉండే కార్మెటివ్ గుణాలు జీర్ణాశయంలో ఆహారాన్ని త్వరగా కిందికి పంపిస్తాయి.
  7. ఊరగాయలు, చట్నీలు వంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది.
  8. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కోసం నిమ్మ, బెల్లం, పెరుగు, అరటి పండు తీసుకోవచ్చు.
  9. ఎసిడిటీ బాధితులు బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, వెల్లులి, క్యారెట్, మునగ కాయలు తీసుకోవచ్చు.

కడుపు ఉబ్బరం కారణాలు ఇవీ..

కొన్నిసార్లు మనం ఎక్కువగా తినకపోయినా బాగా తిన్నట్టుగా కడుపు నిండుగా అనిపిస్తుంది. అది కొవ్వా ? గ్యాసా ? అనేది అర్థం కాదు. దీన్నే కడుపు ఉబ్బరం అంటారు. శారీరక శ్రమ లేకపోవడం, చాలాసేపు ఒకే చోట కూర్చుండటం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంటుంది. కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. విపరీతమైన ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు కూడా మనిషిని కుంగదీస్తున్నాయి. ఇలాంటి వాటి ద్వారా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి అది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా కడుపులో గ్యాస్, అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తున్నాయి.

Also Read:  OLA: ఓలా తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హబ్‌ను నిర్మించాలని యోచిస్తోంది