Health Tips : ఈ 13 ఆరోగ్య సూత్రాలు పాటిస్తే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం

భోజనం తినేటపుడు కింద కూర్చుని తినాలి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మధ్యాహ్నం భోజనంలో తినే కూరల్లో వాముపొడిని వాడాలి.

  • Written By:
  • Publish Date - October 21, 2023 / 09:57 PM IST

Health Tips : మనిషి దీర్ఘకాలంపాటు జీవించాలంటే.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో.. జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడి.. ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకుంటున్నారు. కానీ.. ఈ 13 ఆరోగ్య సూత్రాలను పాటిస్తే.. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం.

  • 13 ఆరోగ్య సూత్రాల్లో మొదటిది.. ఉదయాన్నే నిద్రలేవడం. ఉదయం 4.30 గంటలకే నిద్రలేచి, నోరు పుక్కిలించి ఒకగ్లాసు గోరు వెచ్చని నీరు నెమ్మదిగా తాగాలి.
  • ఆ తర్వాత ఒక గంట సమయంపాటు శరీరం, శ్వాస వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, యోగా చేయాలి. ఇవ్వన్నీ పూర్తయ్యాక గోరువెచ్చని నీటితో లేదా.. చన్నీటితో స్నానం చేయాలి.
  • ఉదయం 8.30 గంటలలోపే అల్పాహారం తినాలి. వాటిలో పండ్లు, పండ్లరసం ఉండాలి. టిఫిన్ చేసిన వెంటనే పని చేసుకోవాలి.
  • మధ్యాహ్నం లోగా 2-3 గ్లాసుల మంచినీరు త్రాగాలి. 48 నిమిషాల్లో భోజనం చేస్తారనగా.. మరో గ్లాస్ మంచినీళ్లు తాగాలి.
  • భోజనం తినేటపుడు కింద కూర్చుని తినాలి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మధ్యాహ్నం భోజనంలో తినే కూరల్లో వాముపొడిని వాడాలి.
  • భోజనం తర్వాత మరిచిపోకుండా ఒక్కగ్లాసు మంచినీరు తాగాలి. 30-40 నిమిషాల పాటు రిలాక్స్ అయి.. మళ్లీ పని చేసుకోవాలి.
  • సూర్యాస్తమయంలోగా రాత్రి భోజనం పూర్తి చేసి.. కనీసం ఒక కిలోమీటరైనా నడవాలి.
  • భోజనం చేసిన గంట తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలి. ఎట్టి పరిస్థితిలోనూ 9 గంటల తర్వాత మేల్కొని ఉండకూడదు.
  • అలాగే.. రాత్రి తినే ఆహారంలో.. పెరుగు, మజ్జిగ, పుల్లటిపండ్లు, సలాడ్ వంటి వాటిని తినకూడదు. ఆహారంలో చక్కెర, ఉప్పు, మైదా వీలైనంత వరకూ తీసుకోకపోవడం మంచిది. చాలా తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి.
  • పాలు తాగినపుడు అందులో కొద్దిగా పసుపువేసి మరిగించి తాగితే.. క్యాన్సర్ వంటి వ్యాధి వచ్చే శాతం తగ్గుతుంది.
  • ఫ్రిడ్జ్ లో పెట్టిన పండ్లు, కూరగాయలు, పదార్థాలను.. అందులో నుంచి తీసిన గంట తర్వాతే తినాలి. ఏ ఆహారమైనా వండిన 40 నిమిషాల్లోపే తినేయాలి.
  • మార్చ్ నుంచి జూన్ మధ్యకాలం (ఎండాకాలం)లో మట్టిపాత్రలో ఉంచిన నీరు తాగాలి. జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్యకాలం (వర్షాకాలం)లో రాగిపాత్రలో నిల్వచేసిన నీటిని తాగాలి.
  • ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, మద్యం, ధూమపానాలకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది.