Menstruation: నెలసరి నొప్పికి చెక్ పెట్టే డైట్ !

స్త్రీ జీవితంలో ఋతుస్రావం ఒక సాధారణ భాగం. ప్రతి ఋతు చక్రంలో స్త్రీ శరీరం పిండాన్ని పోషించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటుంది.

  • Written By:
  • Publish Date - June 17, 2022 / 06:30 AM IST

స్త్రీ జీవితంలో ఋతుస్రావం ఒక సాధారణ భాగం. ప్రతి ఋతు చక్రంలో స్త్రీ శరీరం పిండాన్ని పోషించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటుంది. అయితే అది ఫలదీకరణం జరగకపోతే, అప్పుడు పీరియడ్స్ వస్తాయి. కొంతమందిలో నెలసరి నొప్పి తీవ్రదశలో ఉంటుంది.ఋతువు ప్రారంభానికి ఒక రోజు ముందు పొత్తికడుపులో కండరాలు ఎవరో గట్టిగా పట్టుకుని సలుపుతు ఉన్నట్లుగా మొదలై అది ఋతు సమయంలో మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. దీనితో పాటే కడుపులో వికారం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఋతుక్రమంలో వచ్చే నొప్పిని అలక్ష్యం చేయకూడదు. తేలికపాటి నొప్పి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* క్యాబేజీ, బ్రాకొలి, కాలి ఫ్లవర్, పాల కూర వంటి వాటిని వాడాలి. వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి.

* కీర దోస కాయలు, పుచ్చకాయలు వంటి సీ విటమిన్ ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల బాడీ హైడ్రేటెడ్ అయి ఉంటుంది.

* ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, ప్రోటీన్లు చేపల్లో ఉంటాయి. వీటిని డైట్ లో భాగం చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

* పసుపు, పెరుగు, గుడ్లు, క్వినోవా, విత్తనాలు, పప్పు ధాన్యాలు, డార్క్ చాకోలేట్, అల్లం, పల్లీలు, టోఫు లను కూడా తింటే మంచిది.