Blood Pressure : మీకు హైబీపీ ఉందా? అయితే వాటికి దూరంగా ఉండండి..!

High BP: హైబీపీ....ఈ సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి.

  • Written By:
  • Publish Date - February 13, 2022 / 10:00 AM IST

High BP: హైబీపీ….ఈ సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. కొన్ని రకాల ఫుడ్స్ బీపీ పెంచేస్తాయి. సాధారణంగా మనకు బీపీ 120/80గా ఉండాలన్న సంగతి తెలిసిందే. కానీ ఈ బీపీ అంతకు మంచితే తగ్గుతుంది. అలాంటి సమయంలో చికిత్స తీసుకోన్నట్లయితే గుండె ప్రమాదంలోపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బీపీ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీరు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉన్నట్లయితే వారి…బీపీ అదుపులో ఉంటుంది. మరి అవి ఎలాంటి ఫుడ్స్ తెలుసుకుందాం.

1. కెఫిన్ : హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడేవారు కెఫిన్ కు దూరంగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా సోడా, కాఫీ వంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
2.సుగంధ ద్రవ్యాలు: బీపీని పెంచడంలో మసాలాలు ముందుంటాయి. అందుకే ఎక్కువ మసాలాలు, స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఒకవేళ మసాలా ఫుడ్స్ తినాలనుకుంటే తక్కువ మోతాదులో ఉన్న ఫుడ్స్ ను తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు.

3. ఉప్పు: బీపీ పేషంట్లు ఉప్పును మోతాదుకు మంచి వాడొద్దు. అది ఎంత డేంజరో తెలిసిన విషయమే. అధిక బీపీ సమస్యతో బాధపడుతున్నవారికి ఉప్పు విషంతో సమానం. ఎందుకంటే ఈ సమస్య ఉన్న వారు ఉప్పును మోతాదుకు మించి వాడకూడదు. మోతాదుకు మించినట్లయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
4. షుగర్: హైబీపీతో బాధపడేవారు తీపీ పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే షుగర్ మోతాదు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో మీ బీపీ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.

5.ప్యాకెట్ ఫుడ్స్: బీపీ ఎక్కువగా ఉన్నవారు ప్యాక్ చేసిన ఫుడ్స్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆహారంలో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ సోడియమే అధిక రక్తపోటుకు ప్రధాన కారణం.