Kidney Problem: కిడ్నీల డ్యామేజ్‌కు 10 కారణాలు.. ఇవి చెయ్యకపోతే ఎన్ని లాభాలో!

ప్రస్తుతం మనం ఉన్న రోజుల్లో చాలా మంది ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు వహిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే సమయం వరకు కూడా వారి ఆరోగ్యంలో ఎన్నో రకాల జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 07:30 AM IST

ప్రస్తుతం మనం ఉన్న రోజుల్లో చాలా మంది ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు వహిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే సమయం వరకు కూడా వారి ఆరోగ్యంలో ఎన్నో రకాల జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఆరోగ్యం విషయంలో కాస్త అస అసద్దంగా వహిస్తూ ఉంటారు అయితే ఇలా ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా వహించేవారు,ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించే వారిని పోల్చి చూసుకుంటే ఆరోగ్యం పట్లఅశ్రద్ధ వహించే వారే ఎక్కువ శాతం అనారోగ్యాల బారిన పడుతున్నారు. అదేవిధంగా మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం చేసే కొన్ని పనులు కారణంగా కూడా పలు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

ఆరోగ్యం విషయంలో మనం తెలిసి తెలియక చేసే తప్పులే వల్లే మనమే ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. ఇటువంటి రోజుల్లో ఎక్కువ శాతం మంది బాధపడుతున్న సమస్యల్లో కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం అన్నది కూడా ప్రధాన సమస్యగా మారిపోయింది. కానీ చాలామంది ఎటువంటి పొరపాటు చేయకపోయినా మాకు కిడ్నీ సమస్య వచ్చింది అని బాధపడుతూ ఉంటారు. మరి కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి కారణం అయ్యే పది అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందులో మొదటిది యూరిన్ కి వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకోవడం. ఇలా చేయకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు.. ఇక రెండవది ఎక్కువగా ఉప్పును తీసుకోవడం.

ఇక మూడవది ప్రతి చిన్న దానికి పెద్ద దానికి మెడిసిన్స్ ను ఎక్కువగా ఉపయోగించడం. అలాగే సిగరెట్స్ టొబాకో లాంటివి ఉపయోగించడం. ఇక మాంసాన్ని కూడా ఎక్కువగా తీసుకోవడం ఈ కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే సరిగా నిద్రపోకపోవడం కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే వాటికీ కారణం కావచ్చు. అలాగే శరీరంలో కొన్ని కొన్ని సార్లు జరిగే ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మితిమీరి ఎక్కువగా తినడం వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే నీళ్లు తాగే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. నీటిని అధికంగా తాగకూడదు. అలా అని నీటిని తక్కువగా కూడా తాగకూడదు.