Site icon HashtagU Telugu

Fact Check : ఓ వర్గం ఇళ్లపై దాడి.. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగిందా ?

Fact Check Pakistan Video Hindu Home Attacked India Hyderabad 

Fact Checked By logicallyfacts

ప్రచారం :  ‘‘తెలంగాణలోని హైదరాబాద్‌లో హిందువుల ఇళ్లలోకి బలవంతంగా చొరబడటానికి కొందరు అల్లరిమూకలు యత్నించారు. అల్లరిమూకలు ఒక పెద్ద భవనంలోకి ఎక్కడానికి ప్రయత్నించడాన్ని ఇక్కడ చూడొచ్చు’’ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వాస్తవం : ఈ వీడియోకు సంబంధించి రాసిన మొత్తం సమాచారం అవాస్తవం.  ఈ వీడియో  2022 సంవత్సరం నాటిది. ఇందులో పేర్కొన్న హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనిది కాదు. అది పాకిస్తాన్‌లోని హైదరాబాద్ నగరం. అక్కడ జరిగిన ఓ ఘటనను 2022లో వీడియోలో రికార్డు చేశారు.

ప్రచారం ఏమిటి?

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న హిందువుల ఇళ్లలోకి బలవంతంగా అల్లరి మూకలు(Fact Check) ప్రవేశించారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఒక ఫేస్‌బుక్ యూజర్ ( ఇక్కడ ఆర్కైవ్ చేయబడింది ) ఈ క్లిప్‌ను హిందీ క్యాప్షన్‌తో షేర్ చేశాడు. దీని అర్థం:  “ఈ దృశ్యం ఆఫ్ఘనిస్తాన్ లేదా పాకిస్తాన్‌లోనిది కాదు. తెలంగాణకు చెందింది”. “శరీరం నుంచి తలను వేరు చేయండి’’ అనే నినాదంతో హిందువుల ఇళ్లలోకి అల్లరి మూకలు బలవంతంగా చొరబడుతున్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, లేకపోతే పరిస్థితి కశ్మీర్‌లా మారుతుంది. కశ్మీర్‌లో హిందువులను రక్షించడానికి ఎవరూ వెళ్లనట్టే.. ఏ నాయకుడు, సంస్థ, మీడియా మిమ్మల్ని రక్షించడానికి రారు” అని ఆ వీడియోకు సంబంధించిన క్యాప్షన్‌లో రాశారు.

ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఇలాంటి పోస్ట్‌ల ఆర్కైవ్ చేసిన వెర్షన్‌లను ఇక్కడ , ఇక్కడ మరియు  ఇక్కడ చూడొచ్చు .

ఈ వీడియో Xలో కూడా ఇలాంటి వాదనలతో కనిపించింది. ఆ పోస్ట్‌లకు లింక్‌లు ఇక్కడ  మరియు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి .

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ పోస్ట్‌ల స్క్రీన్‌షాట్ (మూలం: X/Facebook/Screenshot/Modified by Logically Facts)

వాస్తవం ఏమిటంటే ఈ వీడియో 2022 నాటిది. దీన్ని భారతదేశంలో కాకుండా పాకిస్తాన్‌లో రికార్డ్ చేశారని మేం వాస్తవ తనిఖీలో గుర్తించాం.

వాస్తవ తనిఖీలో ఏం తేలింది ? 

వైరల్ క్లిప్‌తో మేం గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్  చేశాం. దీంతో మాకు 2022 ఆగస్టు 22న హిందుస్తాన్ టైమ్స్ అప్‌లోడ్ చేసిన YouTube వీడియో ( ఇక్కడ ఆర్కైవ్ చేయబడింది ) ఒకటి దొరికింది. ఆ వీడియోలో ఇలాంటి సీన్‌లే ఉండటాన్ని మేం గుర్తించాం. దాని క్యాప్షన్‌లో.. ‘‘అశోక్ కుమార్ అనే హిందూ పారిశుధ్య కార్మికుడు దైవదూషణ చేశాడనే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో అల్లరిమూకల సమూహం అశోక్ కుమార్‌పై దాడికి యత్నించారు’’ అని రాశారు.

వైరల్ క్లిప్ మరియు హిందుస్తాన్ టైమ్స్ షేర్ చేసిన వీడియో మధ్య పోలిక (మూలం: X/YouTube/Screenshot)

వార్తా నివేదికల్లో..

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఉన్న షాప్, గూగుల్ మ్యాప్స్‌లో కనిపించే షాప్ పేరు మధ్య పోలిక. (మూలం: ఇన్‌స్టాగ్రామ్/గూగుల్ మ్యాప్స్)

మొత్తం మీద ఆ వైరల్ వీడియోకు పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌‌తో మాత్రమే సంబంధం ఉందని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా logicallyfacts వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 

Exit mobile version