Feroze Gandhi: ‘‘రాహుల్‌గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ’’ అని ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు. ‘‘ఎవరు చట్టపరంగా మతాన్ని మార్చుకున్నారో చర్చ చేయాలని అనుకుంటే, ఢిల్లీలోని జనపథ్ నుంచే ప్రారంభించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. ఇంతకీ బండి సంజయ్ వ్యాఖ్యల్లో నిజమెంత ? ఫిరోజ్ గాంధీ మతపరమైన నేపథ్యం ఏమిటి ? ఆయన అంత్యక్రియలను ఏ మతం ప్రకారం చేశారు ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Rs 850 Crores Scam: హైదరాబాద్‌లో రూ.850 కోట్ల స్కామ్.. పోంజి స్కీమ్‌తో కుచ్చుటోపీ
ఫిరోజ్ గాంధీ గురించి..
- ఫిరోజ్ గాంధీ(Feroze Gandhi) పూర్తి పేరు.. ఫిరోజ్ జహంగీర్ గాంధీ.
- ఆయన 1912 సెప్టెంబరు 12న ముంబైలోని ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. 1960 సెప్టెంబరు 8న తుదిశ్వాస విడిచారు.
- ఫిరోజ్ గాంధీ తండ్రి పేరు జహంగీర్. జహంగీర్ ఒక మెరైన్ ఇంజినీర్.
- ఫిరోజ్ గాంధీ ఒక స్వాతంత్య్ర సమర యోధుడు. ఆయన అప్పట్లో ఒక ప్రముఖ జర్నలిస్ట్.
- కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ యాక్టివ్‌గా ఉండేవారు.
- ఫిరోజ్ గాంధీ విద్యార్థిగా ఉన్నప్పుడు స్వదేశీ ఉద్యమంలో భాగంగా తాను చదువుతున్న బ్రిటీష్ ప్రభుత్వ కాలేజీ నుంచి బయటికి వచ్చారు. స్వదేశీ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈక్రమంలోనే ఫిరోజ్‌కు నెహ్రూ కుటుంబంతో పరిచయం ఏర్పడింది.
- నెహ్రూ కుటుంబానికి చెందిన ఆనంద్ భవన్‌కు ఫిరోజ్ వెళ్తుండేవారు. ఈ సమయంలోనే మహాత్మాగాంధీపై అభిమానంతో తన పేరులో గాంధీ అనే పదాన్ని ఫిరోజ్ చేర్చుకున్నారు.
- ఫిరోజ్ గాంధీ తొలిసారిగా తన ప్రేమ గురించి 1933 సంవత్సరంలో ఇందిరాగాంధీకి ప్రపోజ్ చేశారు. అయితే అప్పుడు ఇందిర వయసు 16 ఏళ్లే.
- ఇందిరాగాంధీ తల్లి కమలా నెహ్రూకు కూడా ఫిరోజ్ సుపరిచితులే. 1936 ఫిబ్రవరి 28న కమలా నెహ్రూ కన్నుమూశారు.
- తదుపరిగా ఇంగ్లండ్‌లో ఫిరోజ్ గాంధీ ఉన్న సమయంలో ఇందిరాగాంధీకి మరింత సన్నిహితులు అయ్యారు.
- ఇందిర, ఫిరోజ్‌లు 1942 మార్చిలో పెళ్లి చేశారు. ఆది ధరం హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది.
- 1950 నుంచి 1952 మధ్యకాలంలో నాటి ప్రొవిన్షియల్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యుడిగా వ్యవహరించారు.
- 1952లో జరిగిన భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ఫిరోజ్ గాంధీ పోటీ చేసి లోక్‌సభ సభ్యుడు అయ్యారు.ఈ ఎన్నికల్లో ఫిరోజ్ తరఫున స్వయంగా ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారం చేశారు.
- దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ కుటుంబానికి చెందిన నేషనల్ హెరాల్డ్, ది నవజీవన్ అనే పత్రికలను ఫిరోజ్ గాంధీ నిర్వహించేవారు.
Also Read :Koneru Konappa : కోనేరు కోనప్ప ఏం చేయబోతున్నారు ? ఆయన మాటలకు అర్థం అదేనా ?
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు ఇలా..
ఫిరోజ్ గాంధీ 48 ఏళ్ల వయసులో 1960 సెప్టెంబరు 8న గుండెపోటుతో చనిపోయారు. తన అంతిమ సంస్కారాలను పార్శీ సంప్రదాయం ప్రకారం చేయొద్దని ఆయన తన స్నేహితులతో చెప్పారు. అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం ఫిరోజ్ గాంధీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అయితే అంత్యక్రియలకు ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఫిరోజ్ గాంధీ చితాభస్మాన్ని మూడు భాగాలుగా విభజించి, ఒక భాగాన్ని నెహ్రూ సమక్షంలో అలహాబాద్ త్రివేణి సంగమంలో కలపగా, మరో భాగాన్ని ఆయన ఎక్కువ కాలం ఉన్న అలహాబాద్‌లోనే ఉంచారు. మూడో భాగాన్ని సూరత్‌లోని ఫిరోజ్ గాంధీ పూర్వీకుల శ్మశాన వాటికలో ఉంచారు.