Site icon HashtagU Telugu

Fact Check: ‘‘రాజకీయాలకు గుడ్ బై.. అమెరికాకు కేసీఆర్’’.. ఈ ప్రచారంలో నిజమెంత ?

Fact Check Kcr Politics America Usa Brs Ktr 2025

Fact Checked By Newsmeter

ప్రచారం : కేసీఆర్ రాజకీయాల నుంచి  తప్పుకొని అమెరికాలో స్థిరపడనున్నారు.

వాస్తవం : ఈ ప్రచారం తప్పు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా కేసీఆర్ ఎక్కడా ప్రకటించలేదు.

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పి, అమెరికాలో స్థిరపడతారంటూ ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ న్యూస్ క్లిప్‌లో.. ‘‘ప్రత్యక్ష రాజకీయాల నుంచి కేసీఆర్ రిటైర్ అవుతారని విశ్వసనీయ సమాచారం. న్యూయార్క్‌లో చింతలపూడి శకుంతలా దేవి ఇంటి పక్కన కొత్త ఇంటిని కేసీఆర్ కొననున్నారు. పెళ్లి కాకముందు నుంచీ శకుంతల దేవితో కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ షిప్’’(Fact Check) అని ఆ న్యూస్ క్లిప్‌లో ప్రస్తావించారు. ఈ న్యూస్ క్లిప్‌పై తెలంగాణ న్యూస్ టుడే లోగో, లింక్ ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో ఈ న్యూస్ క్లిప్‌ను అప్‌లోడ్ చేశారు. (ఆర్కైవ్)

అవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టును ఇక్కడ చూడొచ్చు.(ఆర్కైవ్)

ఫ్యాక్ట్ చెక్‌లో ఏమేం గుర్తించారు ?

ఈ వార్తా సంస్థ  పేరుతో  ప్రచురించిన రెండు వార్తలు కూడా ఉనికిలో లేవు. తెలంగాణ న్యూస్ టుడే డైలీ సంస్థ పేరుతో వైరల్ అవుతున్న  న్యూస్ క్లిప్పింగ్‌లను నమ్మకూడదు. అవన్నీ ఫేక్. బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయించేందుకే  ఈ న్యూస్ క్లిప్పులను వైరల్ చేయించినట్లుగా కనిపిస్తోంది. కాబట్టి న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా న్యూస్ మీటర్ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)