Fact Checked By boomlive
ప్రచారం : ‘‘పవిత్ర రంజాన్ మాసం వేళ పుచ్చకాయల్లో రసాయనాలను కలిపి అమ్ముతున్న హిందూ యువకుడు’’ అంటూ ఒక వీడియో వైరల్ అయింది.
వాస్తవం : మరో విషయానికి సంబంధించిన వీడియోను ఎడిట్ చేసి, ఈ వైరల్ వీడియోను తయారు చేశారు. ఈ వీడియో 10 నెలలు పాతది. దీనికి ఏ నిజమైన సంఘటనతోనూ సంబంధం లేదు.
Also Read :Prakash Raj Vs PM Modi: మణిపూర్‌కూ ఓసారి వెళ్లండి.. మోడీ గిర్ టూర్‌పై ప్రకాశ్‌రాజ్ ట్వీట్
పుచ్చకాయలోని ఎరుపు రంగును కృత్రిమంగా పెంచడానికి, దానిలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేస్తున్నారనే వాదనతో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు రంజాన్ మాసంతో లింక్ పెడుతున్నారనే మతపరమైన వాదనతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వైరల్ అయిన ఈ వీడియో ఫేక్ అని, అది ఎడిట్ చేసిన వీడియో అని బూమ్ గుర్తించింది.
అసలు వీడియోను ఎడిట్ చేసి..
ఆహార కల్తీ గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ది సోషల్ జంక్షన్’ యూట్యూబ్ ఛానల్ అసలు వీడియోను రూపొందించింది. ఇక వైరల్ అయిన వీడియోలో ఒక యువకుడు.. పుచ్చకాయ, మందు, ఇంజెక్షన్‌తో పుచ్చకాయలో ఆర్టిఫీషియల్‌గా ఎరుపు రంగును తెస్తున్నట్లు చూడొచ్చు. ఈ యువకుడిని పోలీసులు పట్టుకున్నట్లు సదరు వీడియోలో చూపించారు. మార్చి 2 నుంచి దేశంలో రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం సమాజంలో రంజాన్ పవిత్ర మాసంగా జరుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ఈ వీడియోను రంజాన్‌తో అనుసంధానిస్తూ సోషల్ మీడియాలో మతపరమైన వాదనతో షేర్ చేస్తున్నారు.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘రంజాన్‌లో ముస్లింల ప్రాణాలను కాపాడండి. ఈ వీడియోను షేర్ చేసి మంచి పేరు సంపాదించండి. రంజాన్‌లో ఇఫ్తారీ కోసం షాపింగ్ చేసే క్రమంలో మీరు చేసే ఒక తప్పు అందరినీ ఇబ్బందిపెడుతుంది’’ అని రాసుకొచ్చాడు. (ఆర్కైవ్ లింక్)
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో కూడా ఈ వీడియో అదే వాదనతో వైరల్ అవుతోంది. ఆర్కైవ్ లింక్
వాస్తవ తనిఖీలో ఏం తేలింది ?
- వైరల్ వీడియోకు జోడించిన ‘టీమ్ రైజింగ్ ఫాల్కన్’ అనే వాటర్‌మార్క్‌ను మేం శోధించాం. దీంతో మాకు ఆ పేరుతో ఉన్న ఎక్స్- అకౌంట్ దొరికింది. ఈ అకౌంటు నుంచి మార్చి 2న వీడియోను షేర్ చేసినట్లు మేం గుర్తించాం.
- వైరల్ వీడియోకు చెందిన కీ ఫ్రేమ్‌లను మేం రివర్స్ ఇమేజ్‌లో సెర్చ్ చేశాం. వైరల్ అయిన వీడియోను పోలి ఉన్న వీడియోకు సంబంధించిన ఇండియా టుడే యొక్క 2024 మే నెల ఫీచర్ స్టోరీ మాకు కనిపించింది.
Also Read :Hyderabad Tour : హైదరాబాద్ ఒకరోజు ఫుల్ టూర్.. ఛార్జీ రూ.430 మాత్రమే
- పుచ్చకాయలో కల్తీ గురించి ‘ది సోషల్ జంక్షన్’ యూట్యూబ్ ఛానల్ ప్రజలకు అవగాహన కల్పించిందనే విషయాన్ని, దానితో ముడిపడిన వీడియోను మేం ఇండియా టుడే నివేదికలో చూశాం. ఇంజెక్షన్ ద్వారా పుచ్చకాయలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేయడాన్ని ఈ వీడియోలో చూపించారు.వీడియోలో కనిపించిన యువకుడు నోటికి రుమాలు కట్టుకుని వైరల్ వీడియోలో ఉన్నట్లు మేము గుర్తించాం.
- తదుపరిగా మేం ఈ వీడియోను ది సోషల్ జంక్షన్ యూట్యూబ్ ఛానెల్‌లో సెర్చ్ చేశాం. మేము 2024 ఏప్రిల్ 29న ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన అసలు వీడియోను గుర్తించాం. ఇందులో ఆ యువకుడు తన పేరును ఆయుష్ వర్మ అని చెప్పాడు.
- ఈ వీడియో ప్రారంభంలో, వైరల్ ఫుటేజ్‌లో ఉన్న వాయిస్ ఓవర్ అనేది.. అసలు వీడియోలో మాకు వినిపించలేదు. వైరల్ వీడియోకు వేరే బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌ను జోడించారని మేం గుర్తించాం. వీడియోను ఎడిట్ చేసి, ఇలా కొత్త యాడ్ చేసిన వాయిస్‌లోనే మతపరమైన వాదనను జోడించారు.
- అసలు వీడియోలోని(Fact Check) 28వ సెకనులో వీడియో క్రియేటర్ ఒక డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. అందులో ‘ఈ వీడియో పూర్తిగా కల్పితం, వీడియోలో చూపబడిన అన్ని సంఘటనలు ఎడిట్ చేయబడ్డాయి. ఈ వీడియో కేవలం అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే తయారు చేయబడింది’’ అని రాశారు.
- సోషల్ జంక్షన్ యూట్యూబ్ ఛానెల్‌లో ఆహార కల్తీకి సంబంధించిన అనేక ఎడిటెడ్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వీడియోలను రూపొందించామని ఛానల్ నిర్వాహకులు తెలిపారు.