Fact Checked By Factly
ప్రచారం : 2025 ఏప్రిల్ 3న హైదరాబాద్‌లోని చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి అంటూ ఒక ఫొటో వైరల్ అయింది.
వాస్తవం : భారీ వర్షాల కారణంగా 2025 ఏప్రిల్ 3న చార్మినార్‌లోని ఒక మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయని మీడియాలో చాలా వార్తా కథనాలు ప్రచురితం అయ్యాయి. కానీ ఈ ఫోటో మాత్రం ఇప్పటిది కాదు. 2019లో అదే విధంగా చార్మినార్(Fact Check) నుంచి సున్నం పెచ్చులు ఊడి పడ్డాయి. ఆనాటి ఫొటోనే ఇప్పుడు కూడా వాడారు. కాబట్టి ఈ ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని తేలింది.
హైదరాబాదులోని చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయని చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఫొటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) చక్కర్లు కొడుతోంది. అసలు, ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్‌ను మీరు ఇక్కడ చూడొచ్చు.
వాస్తవ తనిఖీలో..
- ఈ ప్రచారాన్ని వేరిఫై చేయడానికి మేం తగిన కీ వర్డ్స్‌ను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాం. దీంతో మాకు 2025 ఏప్రిల్ 3న హైదరాబాదులో కురిసిన భారీ వర్షం కారణంగా, చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయంటూ ప్రచురితమైన పలు వార్తా కథనాలు కనిపించాయి. (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వార్తా కథనాల ప్రకారం, భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న ఒక మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ ఈ సంఘటనకు చెందిన ఈ వార్తా కథనాల్లో ఉన్న ఫొటోలకు, వైరల్ ఫోటోకు మధ్య వ్యత్యాసం ఉందని మేం గమనించాం. అలాగే ఈ కథనాల్లో.. వైరల్ అవుతున్న ఫొటో కూడా లేదు.