Site icon HashtagU Telugu

Fact Check : పాకిస్తాన్‌లో తల్లిని పెళ్లాడిన యువకుడు ? నిజమేనా ?

Fact Check Son Married Mother Pakistan Viral Claim Abdul Ahad

Fact Checked By newsmeter

ప్రచారం : ఒక పాకిస్తానీ యువకుడు తన తల్లితో పెళ్లి చేసుకున్నాడని చెబుతూ ఒక వీడియో వైరల్ అవుతోంది.

వాస్తవం: ఆ ప్రచారం తప్పు. ఆ యువకుడు తన తల్లికి రెండో పెళ్లి చేశాడు. ఆమె రెండో పెళ్లి వార్తను కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కోణంలో ప్రచారం చేశారు.

పాకిస్తానీ యువకుడు, అతడి తల్లి పక్కన కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌(Fact Check) అయింది. వారి సంబంధం ఎలా ఉంటుందనే దానిపై విస్తృతమైన ఊహాగానాలు జరిగాయి.

ఒక X వినియోగదారుడు ఈ  వీడియోను పోస్ట్ చేస్తూ  ఇలా రాసుకొచ్చాడు..   “18 సంవత్సరాల పాటు తనను పెంచిన తల్లినే ఒక కొడుకు ‘పెళ్లి చేసుకున్నాడు’. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అబ్దుల్ అహద్ స్వయంగా తన ‘కథ’ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ విషయాన్ని అబ్దుల్ స్వయంగా ‘బయటపెట్టాడు’’ అని ఆ ఎక్స్ వినియోగదారుడు ఇష్టానుసారంగా రాశాడు! (హిందీ నుంచి అనువదించబడింది) ( ఆర్కైవ్ )

వీడియోలోని టెక్స్ట్ ఇలా ఉంది.. “హృదయపూర్వకమైన సంజ్ఞలో .. కొడుకు తన తల్లిని పెళ్లి చేసుకున్నాడు.”

ఇలాంటి పోస్ట్‌లు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు . ( ఆర్కైవ్ 1 , ఆర్కైవ్ 2 )

ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలింది ?

  • ఈ ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది. ఆ యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకోలేదు. అతడు ఆమె రెండో పెళ్లికి ఏర్పాటు చేశాడు.
  • చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు తమ పోస్ట్‌ల క్యాప్షన్‌లలో ఉపయోగించిన ‘వివాహం చేసుకున్నది’ అనే పదబంధం వల్ల అసలు గందరగోళం ఏర్పడింది. ‘వివాహం చేసుకున్నది’ లేదా ‘వివాహం చేసుకున్నది’ అనే పదం సాధారణంగా కుటుంబ సభ్యుల కోసం వివాహాన్ని ఏర్పాటు చేసే చర్యను సూచిస్తుంది.
  • 2020 సంవత్సరం డిసెంబర్ 30న  హిందుస్థాన్ టైమ్స్‌లో  ఒక కథనం ప్రచురితం అయింది.  “తన తల్లి రెండో పెళ్లికి ఏర్పాటు చేయడం ద్వారా పాకిస్తానీ యువకుడు అందరి హృదయాలను గెలుచుకున్నాడు: ‘క్వీన్ రైజ్డ్ ఏ కింగ్’ అనే టైటిల్‌తో ఆ కథనాన్ని ప్రచురించారు. ఈవిషయాన్ని మేం ఇంటర్నెట్ కీవర్డ్ సెర్చ్‌లో గుర్తించాం.
  • అబ్దుల్ అహద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. తన తల్లి రెండో పెళ్లికి  దారితీసిన హృదయపూర్వక క్షణాలను గుర్తు చేసుకుంటూ పలు సీన్లను ఆ వీడియోలో చూపించారు. ఒక కొడుకుగా తల్లితో తనకు ఉన్న అనుబంధాన్ని అతడు ఈ వీడియోలో హైలైట్ చేశాడు. తల్లికి రెండో పెళ్లి జరగడానికి ముందు.. ఆమె వద్ద కొడుకు కూర్చున్న క్లిప్స్ కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలో ఒక కొడుకు, ఒక తల్లి తప్ప మరే చెడు విషయమూ లేదు.
  • ఇదే అంశంపై ఇండియా టుడేలో ప్రచురితమైన ఒక కథనాన్ని మేం గుర్తించాం.
  • ఇండియా టుడేలో వచ్చిన కథనం ఆధారంగా మేం అబ్దుల్ అహద్  Instagram ఖాతాను గుర్తించాం. అతడు 2024 . డిసెంబర్ 18న పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోను మేం గుర్తించాం.
  • తన పెళ్లి రెండో పెళ్లికి ముందు.. తల్లి వద్ద వినమ్రంగా కూర్చొని దిగిన వీడియోను అబ్దుల్ అహద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.  ఇది తల్లి, కొడుకుల సహజ అనుబంధాన్ని హైలైట్ చేస్తుంది.
  • 2024 సంవత్సరం డిసెంబర్ 20న అబ్దుల్ అహద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. తన తల్లికి రెండో పెళ్లి జరగడానికి ముందు.. ఆమె వద్ద వినమ్రంగా కూర్చున్న ఒక ఫొటోను అతడు పోస్ట్ చేశాడు. ఆ  వైరల్ ఇమేజ్‌ని వాడుకొని చాలామంది తప్పుడు పోస్ట్‌లను క్రియేట్ చేశారు.
  • మొత్తం మీద ఆ పాకిస్తానీ యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకోలేదు. ఆమెకు మరో వ్యక్తితో రెండో పెళ్లి చేశాడు. కాబట్టి వైరల్ అయిన వాదన అబద్ధం.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా న్యూస్ మీటర్ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)