Site icon HashtagU Telugu

Fact Check : ఫిబ్రవరి 1 నుంచి పేపర్ కరెన్సీ బ్యాన్.. ఆ న్యూస్ క్లిప్‌లో నిజమెంత ?

Fact Check Indian Govt Paper Currency Ban Digital Money Digital Currency Kerala

Fact Checked By newsmeter

ప్రచారం : 2025 ఫిబ్రవరి నుంచి భారతదేశంలో పేపర్ కరెన్సీ స్థానంలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తుంది. 

వాస్తవం: ఆ ప్రచారం తప్పు. ఆ వైరల్ క్లిప్పింగ్ ఒక పత్రికా ప్రకటన(యాడ్). దీన్ని వివిధ కేరళ వార్తాపత్రికలు ప్రచురించాయి.  కొచ్చిలోని జైన్ డీమ్డ్-టు-బి విశ్వవిద్యాలయం నిర్వహించే విద్యార్థుల సదస్సు కోసం ఈ వెరైటీ ప్రకటన ఇచ్చారు. 

Also Read :Asif Bashir : భారతీయులను కాపాడిన పాక్‌ అధికారికి అత్యున్నత పురస్కారం

‘‘భారత ప్రభుత్వం పేపర్ కరెన్సీని రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుంది’’ అంటూ మలయాళ పత్రికల్లో ప్రచురితమైన కథనంతో కూడిన పేపర్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక X వినియోగదారుడు ఆ పేపర్ క్లిప్పింగ్‌లలో ఒకదాన్ని షేర్ చేస్తూ.. “ఫిబ్రవరి 1 నుంచి భారత ప్రభుత్వం పేపర్ కరెన్సీని(Fact Check) నిషేధిస్తున్నది. డిజిటల్ కరెన్సీ మాత్రమే ఇక అనుమతించబడుతుంది అనే వార్తలతో మలయాళ మీడియా నిండిపోయింది” అని రాసుకొచ్చాడు. ( ఆర్కైవ్ )

Facebookలో మలయాళంలో ఉన్న ఇలాంటి క్లెయిమ్‌లను ఇక్కడ మరియు ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. ( ఆర్కైవ్ )

వైరల్ క్లిప్‌లో ఇంకా ఏముంది ?

‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి భారతదేశంలో అన్ని ద్రవ్య లావాదేవీలు డిజిటల్ కరెన్సీ ద్వారా నిర్వహించబడతాయి’’ అని ఆ పేపర్ క్లిప్పింగ్‌లలో ప్రస్తావించారు. ‘‘ ఫిజికల్ కరెన్సీ (పేపర్ నోట్స్)ని దశలవారీగా ఉపసంహరిస్తారు. నగదు ఉన్నవారు తమ నగదును బ్యాంకుల ద్వారా డిజిటల్ కరెన్సీగా మార్చుకోవడానికి ఫిబ్రవరి 15 వరకు సమయం ఇస్తారు. నల్లధనాన్ని నిర్మూలించడం, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసమే ఈ చర్య. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వానికి అధిక నియంత్రణను అందించడం దీని లక్ష్యం’’ అని ఆ పేపర్ క్లిప్‌లో ఉంది.

‘‘ఈ విధానం భారతదేశాన్ని ప్రపంచ ప్రధాన ఆర్థిక శక్తిగా నిలబెడుతుంది. ‘డిజిటల్ ఇండియా’ చొరవకు పరాకాష్టగా నిలుస్తుంది’’ అని క్లిప్పింగ్‌‌లో ఉంది. ‘‘ఈ పరివర్తన దేశ ఆర్థిక భద్రతను పెంపొందిస్తుంది. భవిష్యత్తు వృద్ధికి తోడ్పడుతుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నట్లు ఆ వైరల్ క్లిప్‌లో ఉంది.

వాస్తవ తనిఖీలో ఏం తేలింది ?

  • తమ యాడ్ వైరల్‌గా మారిన విషయం తెలియగానే జైన్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ టామ్ ఎమ్ జోసెఫ్ క్షమాపణలు చెప్పారు. తమ ప్రకటన వల్ల ఏవైనా అపార్థాలు లేదా ఆందోళనలు కలిగి ఉంటే క్షమించాలని కోరారు . ఆ యాడ్‌లో తాము డిస్‌క్లెయిమర్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.

అందువల్ల, కేరళ వార్తాపత్రికలలో ప్రచురించిన ఒక ప్రకటనను నిజమైన వార్తగా ప్రచారం చేశారు. అందువల్ల దాన్ని అందరూ వార్తే అని భావించారు.  ఆ ప్రకటనలోని ఊహాజనిత అంశాలను వాస్తవాలని చాలామంది భావించారు. అందులో ఉన్నవేవీ వాస్తవాలు కావు.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా న్యూస్ మీటర్’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)