Site icon HashtagU Telugu

Lakshmi Devi: ధనవంతులు అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

Lakhmi

Lakhmi

మామూలుగా ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని అప్పులు ఆర్థిక సమస్యలు వంటివి ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే ధనవంతులు అవుతాము అన్న విషయం ఎలా తెలుస్తుంది? అదృష్టం కలిసి వస్తుంది అన్న విషయం ఎలా తెలుసుకోవాలి అన్న సందేహాలు చాలామందికి వస్తుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని రకాల సంకేతాలు ముందుగానే కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ధనవంతులు కాబోయే ముందు కొన్ని రకాల సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమల గుంపు కనిపిస్తే, వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే అది మంచి సంకేతంగా భావించాలి. ముఖ్యంగా ఈ నల్ల చీమలు ఏదైనా చిరు తిండిలో కనిపిస్తే అది ఇంకా మీకు శుభసూచకంగా భావించాలని చెబుతున్నారు. వాస్తులో చెప్పినట్లుగా మీ ఇంట్లో నల్ల చీమల గుంపు హఠాత్తుగా కనిపిస్తే లక్ష్మీ దేవి మీ ఇంటికి వస్తున్నట్లు ముందుగానే మీకు సూచిస్తుంది. అంటే మీరు త్వరలో ధనవంతులు అవుతారు అని అర్థం. కాబట్టి మీ ఇంట్లోని నల్ల చీమలను తరిమికొట్టే ప్రయత్నం చేయకండి. అంతే కాకుండా ఇంటి దగ్గర ఎక్కడైనా పక్షి గూడు నిర్మిస్తే అది వాస్తు ప్రకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ఇంట్లో ఏదైనా చిన్న పక్షి, పిచ్చుక, పావురం గూడు కట్టుకుంటే డబ్బు త్వరలో వస్తుందని అర్థం అంటున్నారు. ఇంటి ముందు పిచుకలు గూడుకడితే ఇంటికళ పోతుందని చాలా మంది పోరపాటు పడుతుంటారు. కానీ అలాంటి సంకేతాలు కనపడితే త్వరలో మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుందని దాని అర్థం అని తెలుసుకోవడం మంచిది. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే చెవుల్లో శంఖం ఊదుతున్న శబ్ధం వినబడటం కూడా శుభసూచకంగా భావించాలట. అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తోందని దాని అర్థం. మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్ధం. ఇలాంటి సంకేతాలు వచ్చిన తరువాత మీరు ఇంట్లో పూజలు చేస్తే మీకు ఇంకా మేలు జరుగుతుందట.

అయితే ఇలాంటి సంకేతాలు వచ్చిన తరువాత మీరు ఇంటిలోని నల్ల చీమలను బయటకు విసిరేయడం, ఇంటి ముందు పక్షుల గూడులు తొలగించడం లాంటి పనులు పొరపాటున కూడా చెయ్యకండి ఎందుకంటే మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని మీరైమీరే బయటకు పంపించినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు.