Site icon HashtagU Telugu

Lakshmi Devi: ధనవంతులు అయ్యే ముందు ఇంట్లో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసా?

Mixcollage 15 Jul 2024 05 52 Pm 1491

Mixcollage 15 Jul 2024 05 52 Pm 1491

మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు కావాలని ఆర్థిక సమస్యలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. కానీ ధనవంతులు అవ్వడం అన్నది అంత సులభమైన విషయం కాదు. ఒకవేళ ధనవంతులు అయితే అలాంటప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి. నిజామా అంటే. ముందుగానే ఏమైనా సంకేతాలు వస్తాయా అంటే వస్తాయి అంటున్నారు పండితులు. మరి ధనవంతులు అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారం ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమల గుంపు కనిపిస్తే వాటిని తరిమికొట్టడానికి అస్సలు ప్రయత్నించకండి.

ఎందుకంటే అది మంచి సంకేతంగా భావించాలి. ఇంకా చెప్పాలంటే ఈ నల్ల చీమలు ఏదైనా చిరుతిండిలో కనిపిస్తే ఇంకా శుభ సూచకంగా భావించాలని చెబుతున్నారు పండితులు. అలాగే నల్ల చీమల గుంపు హఠాత్తుగా కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థమట. ఇలా నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం. అంతే కాకుండా ఇంటి దగ్గర ఎక్కడైనా పక్షి గూడు నిర్మిస్తే అది వాస్తు ప్రకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఏదైనా చిన్న పక్షి, పిచ్చుక, పావురం గూడు కట్టుకుంటే డబ్బు త్వరలో రాబోతుందని అర్థం.

ఇంటి ముందు పిచుకలు గూడు కడితే ఇంటికళ పోతుందని చాలా మంది పోరపాటు పడుతుంటారు. కానీ అలాంటి సంకేతాలు కనపడితే త్వరలో మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుందని అర్థం. అలాగే ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే చెవుల్లో శంఖం ఊదుతున్న శబ్ధం వినబడటం కూడా శుభసూచకంగా భావించాలి అంటున్నారు పండితులు. పైన చెప్పిన సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే మీ ఇంట్లో పూజలు చేయడం వల్ల మీకు ఇంకా మంచి మేలు జరుగుతుంది అంటున్నారు పండితులు. అయితే ఇలాంటి సంకేతాలు వచ్చిన తరువాత మీరు ఇంటిలోని నల్ల చీమలను బయటకు విసిరేయడం, ఇంటి ముందు పక్షుల గూడులు తొలగించడం లాంటి పనులు పొరపాట్లు అస్సలు చెయ్యకండి. ఎందుకంటే మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని మీరైమీరే బయటకు పంపించినట్లు అవుతుంది.