Site icon HashtagU Telugu

Sunday: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఆదివారం రోజు ఇలా చేయాల్సిందే!

Sunday

Sunday

ఆదివారం రోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్య దేవుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని నమ్మకం. ఆదివారం రోజు సూర్ భగవానునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సమస్యలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన నష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలుగా బాధపడుతున్న వారు ఆదివారం రోజు తప్పకుండా కొన్ని రకాల పరిహారాలను పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఆదివారం నాడు ఉదయాన్నే సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలట. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి నీటిని సమర్పించట. అదేవిధంగా ఆదివారం రోజు ఇంటి ప్రధాన ముఖ ద్వారం వద్ద నెయ్యి దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సూర్యదేవుడితో పాటుగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. అలాగే ఆదివారం ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎర్ర చందనం తిలకాన్ని పెట్టుకోవాలట. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధించవచ్చు అని చెబుతున్నారు.

అదేవిదంగా ఆదివారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం చాలా మంచిదట. ఎందుకంటే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట. అలాగే సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆదివారం రోజు బెల్లం, పాలు, బియ్యం ఎరుపు వస్త్రాలను సమర్పించాలని చెబుతున్నారు. ఆ తర్వాత వీటన్నింటినీ నిస్సహాయులకు దానం చేయాలట. ఈ పరిహారం పాటించడం వల్ల మీకు ఉన్న అన్ని అడ్డంకులను తొలగిపోతాయట. మీకు సమయం ఉంటే వీలు కుదిరితే ఆదివారం రోజు పవిత్ర నదికి వెళ్లి అందులో బెల్లం బియ్యం కలిపి నీటిలో వదిలి పెట్టాలని ఇలా చేస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయని చెబుతున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆదివారం నాడు సూర్యభగవానుడితో పాటుగా లక్ష్మీదేవిని ఈ పద్ధతి ప్రకారం పూజించండి. అలాగే ఈ దేవతల మంత్రాన్ని 108 సార్లు జపించాలట. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందట. వీటిని చేయడంతో పాటు ఆదివారం రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.