Site icon HashtagU Telugu

Spirituality: మీకు మంచి జరిగే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

Spirituality

Spirituality

మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు అన్నది కామన్. జీవితంలో మంచి చెడు జరగబోతున్నాయి అనడానికి కొన్ని కొన్ని రకాల కనిపిస్తూ ఉంటాయి. వాటి ద్వారా మనం జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా మనకు మంచి జరిగే ముందు కూడా కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయట. మరి మంచి జరిగేటప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎవరికైతే బ్రాహ్మ ముహూర్తంలో మెలుకువ వచ్చి గంటల శబ్దం వినిపిస్తుందో, వాళ్లు తెలియకుండా శివనామస్మరణ లేదంటే విష్ణు నామస్మరణ చేస్తారో అలాంటి వారికి త్వరలోనే మంచి జరుగుతుందని సంకేతంగా చెప్పుకోవచ్చట.

అలాగే కలలో ఎవరికైనా ఏనుగు కానీ తెల్ల గుర్రం కానీ కనిపిస్తే త్వరలోనే వారికి లక్ష్మీ అనుగ్రహం కలగబోతోందని అర్థమట. అలాగే ఇంట్లోకి గోమాత వస్తే లేదంటే ఇంటి ముందర గోమాత వచ్చి ఏవైనా తింటే వారికి త్వరలోనే కష్టాలు తొలగిపోతాయని అర్థం అంటున్నారు. గోవు శరీరంలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి గోవు రావడం చాలా శుభప్రదంగా భావించాలట. ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తున్న సమయంలో హారతి ఇస్తున్న సమయంలో దేవుడి ఫోటో పైనుంచి పువ్వు కిందపడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థమని చెబుతున్నారు. వారి కుటుంబంలోని కష్టాలు త్వరలోనే తొలగిపోతాయట.

పురుషులను కుడి కన్ను అదురుతున్నా, కుడి చేయి అదురుతున్నా త్వరలోనే వారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థమని చెబుతున్నారు. ఒక వేల మహిళలకు ఎడమకన్ను, ఎడమచేయి అదురుతూ వున్నా వారికి కూడా సమస్యలు త్వరలోనే తీరిపోతున్నాయని అర్థమట. ఇంట్లోకి ఆంజనేయస్వామి ప్రతిరూపమైన కోతి పూజా మందిరంలోకి వచ్చి కొబ్బరి చిప్ప, లేదంటే పండు తీసుకొని గనుక వెళితే త్వరలోనే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని అర్ధం. ఇంట్లోకి కోతి వచ్చి ఏ వస్తువు తీసుకెళ్లినా రాయితో, కట్టెతో కొట్టవద్దు. కోతి వచ్చిందంటే లక్ష్మీ దేవి త్వరలో కాలు పెట్టబోతోందని అర్థం అంటున్నారు. చిన్న ఆడపిల్లలు ఇంట్లోకి వచ్చి ఆకలివేస్తుందని అడిగితే మీ కష్టాలన్నీ తొలగిపోయినట్లేనని పండితులు చెబుతున్నారు. ఇలా వచ్చిన పిల్లలకు తీపివస్తువులు, బెల్లం, లడ్డూ లాంటివి కఛ్ఛితంగా పెట్టాలని చెబుతున్నారు.

ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు గోమాత, ఏనుగు, గుర్రం ఎదురైతే చాలా శుభప్రదం అని,వెళ్లిన పని సకాలంలో పూర్తవుతుందని,అన్నీ శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలువ వస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మన్మధుడి వాహనం చిలుక. లక్ష్మీ దేవి కుమారుడు మన్మధుడు. కాబట్టి చిలుక వచ్చిందంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతున్నట్టే అర్థం అని అంటున్నారు పండితులు. ఇంట్లో అస్తమానం పాలు పొంగుతూ వుంటే ఇంట్లోకి లక్ష్మీ దేవి రాబోతోందని అర్థం చేసుకోవాలి. త్వరలోనే ఇంట్లో వున్న కష్టాలన్నీ తొలగిపోతాయనడానికి సంకేతమట.