Site icon HashtagU Telugu

‎Karthika Masam: కార్తీకమాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి ఒక్క పని చేస్తే చాలు.. అదేంటో తెలుసా?

Karthika Masam

Karthika Masam

‎Karthika Masam: కార్తీకమాసం శివయ్యకు అంకితం చేయబడింది. ఈ మాసంలో శివుడు, విష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా ఇళ్ళు దేవాలయాలు అన్నీ కూడా కార్తిక దీపాలతో కలకలలాడుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల పరమ శివుని ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. అయితే ఇప్పటికే కార్తీకమాసం మొదలయ్యింది. ఈ నెలలో శివయ్యను పూజించడంతో పాటుగా తులసి మాతను కూడా పూజిస్తారు.

‎వీటితో పాటు ఈ కార్తీక మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. కాగా కార్తీక మాసంలో మీరు శివనామ స్మరణ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు. కార్తీక మాసంలో తులసి మాతకు పూజ చేయడం కూడా మంచిదట. ఈ నెలలో తులసి పూజ చేయడం ద్వారా శివుడితో పాటు విష్ణు మూర్తి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని, కాబట్టి కార్తీక మాసంలో తులసిని పూజించాలని తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలని చెబుతున్నారు.

‎అలాగే కార్తీక మాసంలో నిశ్శబ్ద ధ్యానం చేయడం వల్ల మీకు భగవంతుని ఆశీస్సులు లభిస్తాయట. జంతువులపై ప్రేమ కూడా చూపించాలట. అందువల్ల కార్తీక మాసంలో, ఆవులకు పచ్చి మేత, రోటీ లేదా జంతువులు, పక్షులు తినగలిగే ఏదైనా ఇతర ఆహారాన్ని అందించాలని చెబుతున్నారు. అదేవిధంగా కార్తీక మాసంలో, తెల్లవారుజామున నిద్రలేవాలి. అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి. ముందుగా స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. తర్వాత దామోదర అష్టకాన్ని భక్తితో పఠించాలి. దీనితో పాటు ఈ సమయంలో విష్ణు నామాలను, శివ నామస్మరణ చేయాలని పండితులు చెబుతున్నారు.

Exit mobile version