Site icon HashtagU Telugu

Pooja Tips: దేవుడికి పూజ చేస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పకుండా పాటించాల్సిందే!

Mixcollage 04 Jul 2024 08 29 Pm 5133

Mixcollage 04 Jul 2024 08 29 Pm 5133

హిందువులు ప్రతి రోజు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు భగవంతునికి పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. అంతే కాకుండా ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే దేవుడికి పూజ చేయడం మంచిదే కానీ దేవుడికి పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలి అంటున్నారు పండితులు. మరి దేవుడికి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లోనే పూజ మందిరంలో విగ్రహాలు ఆరు ఇంచుల లోపు మాత్రమే ఉండాలి.

6 ఇంచులకంటే పెద్ద విగ్రహం ఇంట్లో ఉండరాదు. అలాగే మంత్రపుష్పం సుప్రభాతం ఎప్పుడూ కూడా కూర్చుని చదవకూడదు. ఈశ్వరుడికి చేసే పవళింపు సేవను నిలబడి చేయకూడదు. పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా నుదుటిన బొట్టును ధరించాలి. బొట్టు లేకుండా పూజ చేసినా కూడా ఆ పూజ ఫలితం దక్కదు. ఈశ్వరుడికి ఎప్పుడూ ఒక చేతితో నమస్కారం చేయకూడదు.. ఇలా చేస్తే పై జన్మలో చేతులు లేకుండా జన్మించడం చేతులు పోవడం లాంటివి జరుగుతాయి. ఈశ్వరుడికి ఎప్పుడు వీపు చూపించరాదు. అలాగే ఈశ్వరునికి ఎప్పుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం కాబట్టి , దీపారాధనతో అగరబత్తులు అంటించడం సాంబ్రాణి కడ్డీ కాల్చడం కర్పూరం వెలిగించడం లాంటివి అస్సలు చేయకూడదు.

పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈశ్వరుడు మనకంటే ఎత్తులో ఉండాలి. ఎల్లప్పుడూ పూజ వస్తువులు కుడి వైపు నుంచి మాత్రమే తీసుకోవాలి. ఎడమ వైపు నుంచి తీసుకోకూడదు. రుద్రాక్షలు ధరించి వారు మద్యం మాంసం పులివెల్లుల్లి మునగ వంటి పదార్థాలను అస్సలు తినకూడదు. స్త్రీలు ఎప్పుడు కూడా తులసీదళాలను తుంచకూడదు. కేవలం పురుషులు మాత్రమే తులసీదళాలను తుంచాలి. మైల అయిన రోజులు, స్నానం చేయకుండా ఉన్నప్పుడు తులసి మొక్కను తాకరాదు. అలాగే స్త్రీల జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడం పూజలు చేయడం లాంటి అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వారికి అశుభం. స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు రాసుకొని భర్తకి నపడకూడదు. ఒకవేళ భర్త ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య జుట్టు విరబోసుకుని కనిపిస్తే వెనక్కి వచ్చి కాళ్లు చేతులు కడుక్కొని కొద్దిసేపు కూర్చుని బయటికి వెళ్లడం మంచిది.

Exit mobile version