Vastu Tips For Money: బీరువాలో ఈ ఒక్క వస్తువు ఉంటే చాలు.. మీరు కోటీశ్వరులు అవ్వడం కాయం?

చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బులు చేతిలో మిగలడం లేదని నిరాశ చెందుతూ ఉంటారు. కష్టపడి

  • Written By:
  • Publish Date - January 20, 2023 / 06:00 AM IST

చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బులు చేతిలో మిగలడం లేదని నిరాశ చెందుతూ ఉంటారు. కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం చేతిలో డబ్బులు లేకుండా అయిపోయి ఆర్థిక పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉంటారు. అయితే డబ్బు సంపాదించడం ఒక్కటే కాకుండా మనిషికి అదృష్టం అన్నది తప్పనిసరి. అదృష్టం కలగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. శాస్త్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి అలాగే సంపద శ్రేయస్సును పెంచుకోవడం కోసం ఎన్నో రకాల చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా మనం కొన్ని రకాల వస్తువులను తెలిసి తెలియక ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాం. వాటి వల్ల మనం ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాగే కొన్ని వస్తువులను బీరువాలో ఉంచితే శుభప్రదం. బీరువాలో డబ్బు బంగారం దాచుకునే ప్రదేశంలో కొన్ని రకాల వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మరి డబ్బులు దాచుకున్న ప్రదేశంలో ఎటువంటి వస్తువులు దాచుకోవాలంటే పసుపు ముద్దను నగదు పెట్టెలో ఉంచడం వల్ల మీ ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగు పడుతుంది. పసుపును హిందూమతంలో మతపరమైన కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. పసుపు వల్ల ఎప్పుడు మంచి ఫలితాలే తప్ప నష్టాలు ఉండవు.

అలాగే బీరువాలో నగదు పెట్టేలో పసుపు పెన్ని ని ఉంచడం శుభప్రదంగా భావించాలి. దీపావళి, పూర్ణిమ నాడు పూజించిన తర్వాత దానిని నగదు పెట్టెలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం చాలా ఇష్టమైనది. కాబట్టి ఇంట్లోని కబోర్డులో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలగజేస్తుంది. ఆదాయం పెరిగేలా చేస్తుంది. అంతే కాకుండా శుక్రవారం నాడు దానిలో 11 లేదా 21 రూపాయలను కట్టి నగదు పెట్టెలో ఉంచితే సిరి సంపదలతో పాటు లక్ష్మీ అనుగ్రహం లభించి ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టం. ఆ తామర పువ్వులను లక్ష్మీదేవికి పూజలు ఉపయోగించడంతోపాటు ఇంట్లోనే బీరువాలో తామర పుష్పాన్ని ఉంచాలి. తామర పుష్పం ఇంట్లో ఏ ప్రదేశంలో ఉన్నా శుభకరంగా ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు తాజా తామర పుష్పాలనే మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి.