Site icon HashtagU Telugu

Camphor Remedies: కర్పూరంతో ఇలా చేస్తే చాలు.. ధనవంతులవ్వడం కాయం?

Camphor Remedies

Camphor Remedies

కొంతమంది ఎంత సంపాదించినా కూడా డబ్బులు మిగలడం లేదు అని బాధపడుతూ ఉంటారు. డబ్బు మిగలకపోగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఆర్థిక పరిస్థితుల మెరుగుపరుచుకోవడం కోసం సంపద శ్రేయస్సు కోసం వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు చెప్పబడిన విషయం తెలిసిందే. అటువంటి వారు కర్పూరంతో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ఆ సమస్యలను అధిగమించవచ్చు. మరి కర్పూరంతో ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వ్యక్తి దృష్టి దోషంతో బాధపడుతున్నట్లయితే అందుకోసం కర్పూరం ముక్కని తీసుకొని చెడు దృష్టితో బాధపడుతున్న వ్యక్తి తల నుండి పాదాల వరకు సవ్య దిశలో మూడు సార్లు తిప్పాలి. ఆ తర్వాత కర్పూరం నేలపై ఉంచి కాల్చాలి. ఈ విధంగా చేయడం వల్ల దిష్టి దోషం పోతుంది. అదేవిధంగా ఇంత సానుకూలత కోసం శాంతి సంతోషం పొందడానికి కర్పూరాన్ని నెయ్యిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాల్చడం వల్ల సువాసనతో పాటు ఇంటి ప్రతికూలత లభిస్తుంది.

అలాగే రాత్రి సమయంలో వంట ముగించిన తర్వాత ఓ వెండి గిన్నెలో లవంగాలు, కర్పూరాన్ని కాల్చాలి. ప్రతిరోజూ ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తుంది. ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే నిత్యం పూజ చేసినప్పుడు తప్పకుండా కర్పూరాన్ని వెలిగించడం మంచిది.