Site icon HashtagU Telugu

Lord Shiva: సోమవారం రోజున శివుడిని ఇలా పూజిస్తే చాలు.. కలిగే ఫలితాలు ఎన్నో?

Lord Shiva

Lord Shiva

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. పరమేశ్వరుని సోమవారం రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయనకు ఇష్టమైన వాటిని సమర్పించి కోరిన కోరికలు నెరవేర్చమని వేడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సోమవారాల్లో శివుడిని పూజించడం వల్ల అదృష్టాలు, శుభాలు కలుగుతాయి. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సకల పాపాలు తొగలిపోతాయని విశ్వసిస్తారు. సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శివుడికి సోమవారం అత్యంత ప్రీతికరమైన రోజు అన్న విషయం తెలిసిందే. ఆ రోజు శివారాధన చేయడం వల్ల మనిషి జీవితంలో మనశ్శాంతి, శ్రేయస్సు, వ్యాపారంలో విజయం, మంచి ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి భక్తుల విశ్వాసం. ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి కూడా శివ పూజ సహాయపడుతుందని నమ్మకం. సోమవారం రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం స్నానాది కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత శుభ్రమైన, ఉతికిన బట్టలు ధరించాలి. తర్వాత శివ పూజకు ఉపక్రమించాలి. ముందు రోజు లేదా అదే రోజు ఉదయం నేల రాలని పూలను సేకరించాలి. వాటితో పాటు పండ్లు ఫలాలు సమర్పించాలి. వీలైతే శివుడికి ఇష్టమైన నైవేద్యం సిద్ధం చేసుకోవాలి.

అగరుబత్తిలీ అన్నీ ఒకదగ్గర పెట్టుకుని పూజా గదిలో లేదా శివుడి చిత్రపటం ముందు కూర్చోవాలి. తర్వాత శివుడి చిత్రపటానికి, లింగానికి పసుపు, కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. తర్వాత పూలు చల్లి పూజ ప్రారంభించాలి. మొదట వినాయక స్తోత్రం పఠించి ఆయనను కొలిచిన తర్వాతే శివారాధన మొదలు పెట్టాలి. మంత్రాలు, శ్లోకాలు పఠించాలి. ప్రార్థనలు చేయాలి. తర్వాత ధూపదీపాలు వెలిగించి శివయ్యకు సమర్పించాలి. పండ్లు ఫలాలు, కొబ్బరికాయ, నైవేద్యం సమర్పించి హారతు అందజేయాలి. తర్వాత మనస్ఫూర్తిగా శివుడిని మొక్కుకోవాలి. ఏవైనా కోరికలు ఉంటే ఇప్పుడే కోరుకోవాలి. ఇలా చేయడం వల్ల శివుడి కృప కలుగుతుంది. తలపెట్టిన పనులు కూడా విజయవంతం అవుతాయి.

Exit mobile version