Site icon HashtagU Telugu

Hanuman-Lakshmi: డబ్బు, ఆస్తి సమస్యలు ఉన్నాయా.. అయితే హనుమంతుడుని లక్ష్మీని ఇలా పూజించాల్సిందే?

Hanuman Lakshmi

Hanuman Lakshmi

ఈ రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు ఆర్థిక సమస్యలు ఆస్తికి సంబంధించిన సమస్యలు, డబ్బు సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే ఆ సమస్య నుంచి బయటపడడం కోసం అనేక రకాల పూజలు పరిహారాలు వ్రతాలు చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా తరచూ ఆలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. అయితే ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ భగవంతుని భక్తిశ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించడం వల్ల ఆ భగవంతుడు వాటి నుంచి గట్టెక్కిస్తాడు. తన భక్తుడు ఎన్ని తప్పులు చేసినా కూడా తన పెద్ద మనసు క్షమించి కోరిన కోరిక నెరవేరుస్తూ ఉంటారు భగవంతుడు. కొన్ని కొన్ని సార్లు మితిమీరి శృతిమించి తప్పులు చేసే వారికి శిక్షలు కూడా వేస్తూ ఉంటాడు. అలాగే ప్రతి ఒక విజయానికి దేవుడి మీద డిపెండ్ కాకుండా ప్రతి విషయంలోనూ దేవుడు మనకు అందించిన మార్గాన్ని వెతకాలి. తద్వారా మన జీవితంలో మనం కోరుకున్నది సాధించవచ్చు.

సంపదకు దేవత అయిన లక్ష్మి హనుమంతుడు వారి ధైర్యానికి ప్రసిద్ధి చెందారు, భక్తికి దేవతలు. వారిని పూజించడం, ఆయా మంత్రాలను జపించడం వల్ల మనలోని బాధలు తొలగిపోతాయి. లక్ష్మి, హనుమంతల పూజింపడం వల్ల మన సమస్యలు చాలా వరకు తీరుతాయి. డబ్బు లేదా ఆస్తి సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే, లక్ష్మీ, హనుమాన్ లను ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లక్ష్మీదేవిని అలాగే హనుమంతుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు మనకున్న సమస్యలు కూడా తీరిపోతాయి.. ప్రతి రాత్రి పడుకునే ముందు హనుమాన్ మంత్రాన్ని జపించాలి. ఇంతకీ ఆ మంత్రం ఏంటి అన్న విషయానికి వస్తే…

మంత్రం – మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధమతం వారిష్టం, వటతమజం వానరాయకామ్యముక్కం శ్రీరామ దత్తం సర్ణ సర్పణం.

పురుషులు ఈ మంత్రాన్ని జపించి హనుమంతుడిని పూజించవచ్చు. ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి పఠించవచ్చు. అర్ధరాత్రి హనుమంతుని పూజించడం చాలా మంచిది. ఇంట్లో ప్రతికూల విషయాలు ఉంటే ఇంట్లో ప్రతికూల కారకాలతో వ్యక్తికి సమస్యలు ఉంటే, రెండు సాధారణ పరిష్కారాలను అనుసరించవచ్చు. హనుమాన్ ఆరాధన లక్ష్మీ ఆరాధన చేయాలి. లక్ష్మీ లక్ష్మీ దేవి ప్రతిమను మీ ఇంట్లో పెట్టి పూజించాలి. ఉదయం, సాయంత్రం అమ్మవారి ముందు దీపం వెలిగించడం మంచిది. మీ ఇంట్లో తులసి ఉంటే తులసి చెట్టు వద్ద దీపం వెలిగించాలి. కాగా లక్ష్మి దేవి ఆశీస్సులతో మనిషికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. లక్ష్మి కటాక్షం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. తామర లేదా కమలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆమె తామర పువ్వు మీద ఆశీనురాలై ఉంటుంది. తామర పువ్వు సంపదకు చిహ్నం. ఈ పువ్వును పూజ గదిలో ఉంచి లక్ష్మీ మంత్రాన్ని జపించండి. దీని వలన దేవి మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది.

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయతాక్షి!!!
విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ!!!
సరసిజ నిలయే సరోజ హస్తే, మాంశుక గంధమాల్య శోభే!!
భగవతి హరి వల్లభే మనోజ్ఞే , త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం!

Exit mobile version