Site icon HashtagU Telugu

Dussehra: దసరా రోజు ఈ రెండు మొక్కలు పూజిస్తే చాలు.. ఆర్థిక సమస్యలు తొలగిపోవడం ఖాయం!

Dussehra

Dussehra

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ కూడా ఒకటి. ఈ పండుగను దాదాపుగా 9, 10 రోజులపాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక పెద్దపెద్ద దేవాలయాల్లో అమ్మవార్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు. రావణునిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ దసరా పండుగకు అపరాజిత మొక్క అనగా శంఖు పుష్పం అలాగే జమ్మి మొక్కలను పూజించే ఆచారం ఎప్పటినుంచో ఉంది.

దసరా రోజు ఈ రెండు మొక్కలను పూజిస్తే శ్రీ రాముని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు మన ఇంట్లో లక్ష్మీదేవి నివస్తుందని కూడా పండితులు చెబుతున్నారు. ఈ పండుగ రోజు శంఖు మొక్కను ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే.. దసరా రోజు శంఖు మొక్కపై పాలు, నీరు కలిపి పోయాలి. ఆ తర్వాత ఈశాన్య దిశలో అపరాజిత దేవిని పూజించాలి. ముందుగా ఈశాన్యం దిక్కు స్థలాన్ని శుభ్రం చేసి ఆవు పేడతో కప్పాలి జల్లాలి. అలాగే ఆ ప్రదేశాన్ని ముగ్గుతో అలంకరించాలి. అమ్మవారికి నైవేధ్యాన్ని సమర్పించి హారతితో పూజను ముగించాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది.

ఇంటికి ఈశాన్య దిశలో జమ్మి మొక్కను నాటడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. దసరా రోజున దీన్ని ఇంట్లో నాటితే దాని ప్రభావం మరింత పెరుగుతుందంటారు. జమ్మి మొక్కను సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందుకే విజయదశమి రోజు జమ్మి మొక్క ముందు దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. విజయదశమి నాడు జమ్మి వృక్షం ఆకులను ఇంటికి తీసుకొస్తే మంచిదంటారు.