Lard Shiva: సోమవారం పరమశివుడిని ఈ పువ్వుతో పూజిస్తే చాలు.. శివుని అనుగ్రహం లభించినట్టే?

పరమేశ్వరునికి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజు. బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులలో ఒకరైన ఆ పరమేశ్వరుడికి ప్రత్యేకంగా

Published By: HashtagU Telugu Desk
Lard Shiva

Lard Shiva

పరమేశ్వరునికి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజు. బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులలో ఒకరైన ఆ పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శివుడిని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పరమేశ్వరుడు, భోళా శంకరుడు, ముక్కంటి, శివుడు ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆదిదేవుడు అయిన ఆ పరమశివుని అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ శివుని ఆశీస్సులు అంత తొందరగా లభించవు అని చెబుతూ ఉంటారు. అందుకే ఘోర తపస్సులు చేస్తే తప్ప ఆ మహా శివుడు అనుగ్రహించడు.

కానీ పరమశివునికి ఇష్టమైన కొన్ని రకాల పువ్వులు నైవేద్యాలను సమర్పించడం వల్ల తప్పకుండా శివుని అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు ఆయనకు ఎంతో ఇష్టమైన బిళ్వ వృక్షం ఆకులు, పువ్వులను ఉపయోగించి పూజ చేయడం వల్ల తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. బిల్వ మొక్క పూలు, ఆకులు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. వీటి పువ్వులతో పూజ చేయడం వల్ల తప్పకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. జీవితాంతం చేసిన పూజలన్నింటి ఫలాన్ని ఒక బిల్వ పువ్వులు పూజించడం ద్వారా పొందగలరని చెబుతూ ఉంటారు.

అంతేకాకుండా పురాణాల ప్రకారం ఈ పువ్వుతో పరమ శివునికి పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారు అని కూడా ప్రతీతి. అయితే మనకు శివ మొక్క ఆకులు దొరుకుతాయి కానీ పువ్వులు దొరకడం చాలా అరుదు అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ మొక్క పూలు మీకు లభించకపోతే కనీసం ఆకులతో పూజ చేయవచ్చు. ఆకులు అన్నా కూడా ఆ పరమ శివునికి ఎంతో ఇష్టం.

  Last Updated: 22 Jan 2023, 08:36 PM IST